సెప్టెంబర్ లో వీరికి సంపదలను, రాజభోగాలను ప్రకటించిన బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు సెప్టెంబర్ మాసంలో సూర్యుడి రాశి అయిన సింహరాశిలో సంచరించబోతున్నాడు. సెప్టెంబర్ మాసంలో బుధుడు తన రాశి చక్రాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని రాశుల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. సెప్టెంబర్ నెలలో సింహరాశిలో బుధ గ్రహ సంచారం కారణంగా ఏ ఏ రాశుల వారికి లబ్ధి జరుగుతుంది అనేది తెలుసుకుందాం.
సూర్యుడి రాశిలోకి బుధుడు
సెప్టెంబర్ 4వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశి సూర్యుని రాశి. ఇందులో బుధ గ్రహ సంచారం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి ,తులా రాశి ,సింహ రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో సానుకూల ఫలితాలను పొందుతారు. వీరికి ఊహించని ధనలాభం కలుగుతుంది.

సింహరాశి
సింహరాశిలో బుధ గ్రహ సంచారం కారణంగా సింహరాశి జాతకుల ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి . ఈ సమయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు దూరం అవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడపడానికి సమయం కేటాయిస్తే మంచిది. ఇది నిజంగా సానుకూల సమయం.
తులారాశి
బుధ సంచారం కారణంగా తులా రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. తులారాశి జాతకులు వ్యాపారాలలో నిలిచిపోయిన డబ్బులను మళ్ళీ తిరిగి పొందుతారు . ఈ సమయంలో తులారాశి వారికి ఆర్ధిక లాభాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి ప్లాన్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య మెరుగుగా ఉంటుంది.
ధనస్సు రాశి
సెప్టెంబర్ మాసంలో జరిగే బుధ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి శుభాలు చేకూరుతాయి. ధనుస్సు రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో ఈ సమయంలో లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications