మే నెలలో వీరికి బంగారు బిందెలను బహుమతి ఇస్తానన్న బుధుడు!
గ్రహాలు వేటికవి ప్రత్యేకమైనవి. గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలలో బుధుడికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు తెలివితేటలకు, తర్కానికి, కమ్యూనికేషన్ కు ప్రతినిధిగా చెబుతారు. అటువంటి బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఆయా రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు.
మేషరాశిలో బుధ సంచారం
బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నెలరోజుల తర్వాత ప్రయాణం చేస్తాడు. ప్రతి నెల ఒక రాశిని మారుస్తూ ద్వాదశ రాశులలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇక మే 7వ తేదీన బుధుడు మేషరాశిలో సంచారం చేయనున్నాడు. మేషరాశిలో బుధ సంచారం కొన్ని రాశులవారికి స్వర్ణకాలం. వీరి ఆదాయ స్థాయిలను పెంచి, అదృష్టాన్ని తీసుకువస్తుంది. మేషరాశిలో బుధ సంచారం వల్ల అదృష్టం పొందే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
బుధసంచారం కారణంగా మిధునరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. బుధుడు మిధునరాశిలో 11వ స్థానంలో సంచరిస్తాడు. అలాగే బుధుడు మిధునరాశికి అధిపతి కావడంతో వీరి ఆదాయం స్థాయిలలో అపారమైన పెరుగుదల కనిపిస్తుంది. వివిధ ఒప్పందాల నుండి కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. కెరీర్లో ఊహించని పురోగతి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి
మేషరాశిలో బుధ సంచారం కారణంగా సింహ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశిలో 9వ స్థానంలో బుధ సంచారం జరగడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి వారి ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో సింహరాశి జాతకులు కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఎటువంటి సమస్యల నుండైనా ఈ సమయంలో సులువుగా బయటపడతారు.
తులారాశి
మేషరాశిలో బుధ సంచారం కారణంగా తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. తులారాశి వారు ఈ సమయంలో జీవిత భాగస్వామి ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయంతో సంతోషంగా ఉంటారు. వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది కెరీర్లో పురోగతికి అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. అన్ని విధాలుగా తులా రాశి వారికి ఇది శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications