జూన్ లో ఆరుసార్లు బుధుడి పరివర్తన.. ఈ రాశులవారికి సంపదల ఖజానా!
గ్రహాల రాకుమారుడు బుధుడు జూన్ మాసంలో రాశులను, నక్షత్రాలను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు మారుస్తున్నాడు. బుధుడి రాశి, నక్షత్ర పరివర్తన అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశులవారికి ఇది శుభ ఫలితాలను ఇస్తుంటే మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. జూన్ మాసంలో బుధసంచారం కారణంగా ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు అసలు బుధసంచారం ఏ విధంగా జరగబోతుంది అనేది చూద్దాం.
జూన్ లో బుధ సంచారం
జూన్ మాసంలో బుధుడి సంచారం తొలిగా జూన్ 3వ తేదీన సంభవించింది. జూన్ 3న బుధుడు మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశించాడు. ఆపై జూన్ ఆరవ తేదీన బుధుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత జూన్ 9వ తేదీన బుధుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. అనంతరం జూన్ 16వ తేదీన బుధుడు పునర్వసు నక్షత్రం లోనికి వెళ్తాడు.

జూన్ లో ఆరుసార్లు బుధ సంచారం
జూన్ 22వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు. జూన్ 25వ తేదీన బుధుడు పుష్య నక్షత్రం లోనికి వెళతాడు. అందువల్ల జూన్ మాసంలో బుధ సంచారం ఆరుసార్లు జరుగుతుంది. ఇక జూన్ మాసంలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి
బుధ సంచారం కారణంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. బుధ సంచారం వృషభ రాశి వారి అదృష్టాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. వీరికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వృషభ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది.
మీనరాశి
బుధ సంచారం మీన రాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎంతోకాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అయ్యేలా చేస్తుంది. కుటుంబపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయేలా చేస్తుంది. సంబంధాలలో అపార్ధాలు తొలగిపోయేలా చేస్తుంది.
వృశ్చిక రాశి
బుధ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. జూన్ మాసంలో ఆరుసార్లు సంచారం చేస్తున్న బుధుడు వృశ్చిక రాశి వారికి ఊహించని లాభాన్ని కలిగిస్తాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి విజయం, కీర్తి ,ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఏ పని చేసిన ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వీరికి అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది. రచన సామర్థ్యం ఉన్నవారు ఈ సమయంలో రాణిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications