నేటినుండి ఆరురోజులు అదృష్టం వీరికి రాసిచ్చిన బుధుడు!
బుధుడు గ్రహాల రాకుమారుడు. బుధుడిని కమ్యూనికేషన్ కు ప్రతినిధిగా చెబుతారు. అటువంటి బుధుడు నవంబర్ 24వ తేదీన తులారాశిలో సంచారం ప్రారంభించాడు. తుల రాశిలో బుధుడు సంచారం డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగుతుంది. తులా రాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ ఆరు రోజులు బుధుడి కారణంగా అదృష్టవంతులు అయ్యే కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధ సంచారం చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది. వృషభ రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ ఆరు రోజులు వృషభ రాశి వారికి బుధుడు లబ్ధిని చేకూరుస్తాయి.

మిధున రాశి
మిధున రాశి జాతకులకు బుధ సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా మిధున రాశి వారు శుభ ఫలితాలను చూస్తారు. ఇది అన్ని విధాల మిధున రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి కమ్యూనికేషన్, ధైర్యం పెరుగుతాయి. తోడబుట్టిన వారితో సంబంధాలు బలోపేతం అవుతాయి. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది. అన్ని విధాల సింహ రాశి వారికి కలిసివస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. ఆగిపోయిన డబ్బులు తిరిగి పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.ఏ పని చేసినా ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఉద్యోగ రంగంలో అనుకూలతలు ఉంటాయి. గతంలో ఎదురైన ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయి. ఇది మకర రాశి వారికి అన్ని విధాల సానుకూలతను ఇచ్చే సమయం.ఈ సమయం వీరికి ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మకర రాశి వారు అన్ని విధాలా లబ్ధిని పొందుతారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications