స్నానానికి ముందు ఈ చిన్న పని చేయండి చాలు.. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది
వంట గదిలో రుచిని పెంచే ఉప్పు, మీ జీవితంలో అదృష్టాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా? కేవలం వంటలకే పరిమితం కాకుండా, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టే శక్తివంతమైన 'అయస్కాంతం' ఈ రాతి ఉప్పు. వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం, స్నానపు నీటిలో చిటికెడు ఉప్పు కలిపితే మీ తలరాతే మారిపోవచ్చు.
మనోభావాలపై ఉప్పు ప్రభావం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సహజం. వాస్తు శాస్త్రం ప్రకారం, నీరు,ఉప్పు కలయిక చంద్ర, శుక్ర గ్రహాల శక్తిని సమతుల్యం చేస్తుంది. రోజంతా పని ఒత్తిడితో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉప్పు నీటితో స్నానం చేస్తే, అది నరాలను ప్రశాంతపరిచి, కోపాన్ని , చిరాకును దూరం చేస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళ ఇలా చేయడం వల్ల గాఢ నిద్ర మీ సొంతమవుతుంది.

రాహు దోష నివారణకు అద్భుత మార్గం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పనుల్లో ఆటంకాలు, అనవసర భయం ,గందరగోళానికి రాహువు కారణమవుతాడు. రాతి ఉప్పుకు ప్రతికూలతను పీల్చుకునే గుణం ఉన్నందున, ఇది రాహువు ప్రభావం నుండి రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా మీకు దిష్టి పెట్టినా లేదా నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముట్టినా, ఉప్పు నీటి స్నానం మీ వ్యక్తిగత శక్తిని శుద్ధి చేస్తుంది.
ఆర్థిక పురోగతి - లక్ష్మీ కటాక్షం
ఎక్కడైతే సానుకూలత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీలోని ప్రతికూల ఆలోచనలు తొలిగిపోయి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల నిలిచిపోయిన పనులు సాఫీగా సాగడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు తొలిగి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా రాతి ఉప్పు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఖనిజాలు చర్మ రంధ్రాలను శుద్ధి చేయడమే కాకుండా, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి












Click it and Unblock the Notifications