పుట్టుమచ్చలు - ఫలితాలు; ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయంటే!!
మన శరీరంపై పుట్టుమచ్చలు కూడా మన జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తాయి. అనేక ఫలితాలను కలిగిస్తాయి. శరీరంపై ముఖ్యంగా స్త్రీలకు ఎడమవైపున, మగవాళ్లకు కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు. కొన్ని పుట్టుమచ్చలు మనకు లబ్ధిని చేకూరిస్తే, కొన్ని పుట్టుమచ్చలు మనకు నష్టాన్ని చేస్తాయని కూడా చెబుతున్నారు. ఇక ఎటువంటి పుట్టుమచ్చలతో లాభం జరుగుతుంది?. ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది. అంతే కాదు ముక్కు మీద పుట్టుమచ్చ వున్న వారికి కోపం కూడా విపరీతంగా ఉంటుంది. కంఠం మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధన లాభం వచ్చి తీరుతుంది. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్న సంభోగానికి, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. బొటనవేలు పై పుట్టుమచ్చ ఉంటే చదువులో, వ్యాపారంలో రాణిస్తారు. బాగా సంపాదిస్తారు.

నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు, మేధావులుగా తయారవుతారు. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనలాభం కలుగుతుంది. కుడిచేయి చూపుడువేలు వద్ద పుట్టుమచ్చ ఉంటే ధనలాభంతోపాటు , కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. మెడ పైన కుడివైపు పుట్టుమచ్చ ఉంటే భార్య తరపున ధన లాభం వచ్చి పడుతుంది. మోచేయి మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది. బాగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది.
అంతేకాదు కుడి కన్ను మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన దాంపత్య జీవితం ఉంటుంది. స్త్రీలకు తొడల పైన, మర్మస్థానం పైన పుట్టుమచ్చలు ఉంటే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. వారు దాంపత్య జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక పొట్ట కింద పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం కలుగుతుంది. పురుషుడికి పురుషాంగం పై పుట్టుమచ్చ ఉంటే పర స్త్రీల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అటువంటివారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications