Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Monday vastu tips: సోమవారం ఈ పనులు చెయ్యండి.. దరిద్రం తొలగిపోతుంది!!

సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి సోమవారం రోజు శివుడి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల, ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. అటువంటివారు శివుడిని నిష్టతో పూజించి, సోమవారం నాడు ఈ పనులు చేస్తే దరిద్రం తొలగిపోయి, ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఐశ్వర్యవంతులవుతారని చెబుతున్నాయి హిందూ ధర్మ శాస్త్రాలు.

సోమవారం నాడు శివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాధికాలు నిర్వహించేవారు శుభ్రంగా తల స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులపై మనసు లగ్నం చేసి పూజ చేయాలి. అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలను సమర్పిస్తే శివయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి శివుడికి అభిషేకం చేసి శివ అష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించి పూజలు చేయాలి. ఆపై శివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం అత్యంత భక్తితో పూజలు చేసి శివుడికి దద్దోజనం సమర్పించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. రుణ బాధలు తీరుతాయి.

Monday vastu tips: Do these things on Monday.. Poverty will be removed

ఇక మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం శివుడి మూడు కళ్ళకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి కూడా సంకేతం. బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దరిద్రం తొలగిపోతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. శివుడు భక్తవ శంకరుడు, బోళా శంకరుడు, నిష్టతో కొలిస్తే ఎటువంటి వారినైనా కనికరిస్తాడు. అటువంటి పరమశివుడికి ఏది నైవేద్యంగా సమర్పించినా స్వీకరిస్తాడు. కానీ శివుడికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్షును సూచిస్తుంది. ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. అందుకే శివుడిని పూజించేవారు, ముఖ్యంగా సోమవారం నాడు శివ పూజలు చేసేవారు ఈ విధంగా శివుడిని పూజిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+