చంద్రుడి దయతో ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొడతారు!
నవగ్రహాలలో అత్యంత వేగంగా సంచరించే గ్రహం, ఏ రాశిలో నైనా అతి తక్కువ సమయం సంచరించే గ్రహాలలో ఒకటిగా చంద్రుడిని చెప్పుకోవచ్చు. చంద్రుడు ప్రతి రాశిలో సుమారు రెండు నుండి రెండున్నర రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 28 రోజులు పడుతుండగా ఇక జ్యోతిష శాస్త్రంలో ఉండే 12 రాశులలో చంద్ర సంచారానికి సుమారు రెండు నుంచి రెండున్నర రోజులు పడుతుంది.
మేషరాశిలో చంద్ర సంచారం
ప్రస్తుతం చంద్రుడు మార్చి 30వ తేదీన సాయంత్రం మేషరాశిలోకి ప్రవేశించాడు. నేడు కూడా చంద్రుడు మేషరాశి లోనే ఉంటున్నాడు. మేషరాశిలో చంద్ర సంచారం ఫలితంగా ముఖ్యంగా మూడు రాశులవారికి అదృష్టం కలిసి రాబోతుంది. చంద్ర సంచారం ద్వాదశ రాశులవారి జీవితాలలో మార్పులకు కారణం అవుతాడు. కొన్ని రాశులవారికి శుభాలను, కొన్ని రాశులవారికి అశుభాలను ఇస్తాడు. ప్రస్తుతం నేడు మేషరాశిలో చంద్ర సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు చంద్ర సంచారం కారణంగా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. బంధువులతో ఉన్న సమస్యలు పరిష్కరించ బడతాయి. సంతోషంగా జీవిస్తారు. చంద్ర సంచారం వృషభ రాశి వారికి సంతోషకర సమయంగా చెప్పవచ్చు. ఎప్పటినుండో పూర్తికాని పనులు పూర్తవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు చంద్ర సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. మేషరాశిలో చంద్ర సంచారం కర్కాటక రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వస్తాయి. అప్పులు తీరుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాతకంలో చంద్రుడు బలంగా ఉండడం వల్ల వీరికి కలిసి వస్తుంది .సానుకూలత పెరుగుతుంది.
ధనుస్సు రాశి
మేషరాశిలో చంద్రుడు సంచారం ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడంతో పాటు, ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, వాహనాలను కొనుగోలు చేయడం చేస్తారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. పెళ్లయిన వారి జీవితం కూడా సంతోషదాయకం గా ఉంటుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్టం పండుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications