నవ పంచమ రాజయోగంతో ఈ రాశులవారికి మొదలైన నవ విధ ధనయోగాలు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం నిర్దేశ సమయంలో జరుగుతుంది. నవంబర్ 4వ తేదీన శని సూర్యుడు ఒకదానికొకటి 120డిగ్రీల వద్ద నవ పంచమ యోగాన్ని ఏర్పరిచాయి. సూర్యుడు తులా రాశిలోనూ, శని కుంభరాశిలో ను ఉండటం కారణంగా నవంబర్ 4వ తేదీన సూర్యుడు శని ఒకదానితో ఒకటి అయిదవ మరియు తొమ్మిదవ ఇంట్లో ఉన్నప్పుడు నవ పంచమ యోగం ఏర్పడుతుంది. దీనితో కొన్ని రాశులవారికి అదృష్టం మొదలైంది.
మేష రాశి
నవ పంచమయోగం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఇది చాలా కాలం పాటు మేష రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. కష్టపడి పని చేసే మేషరాశి జాతకులకు ఈ సమయంలో కలిసొస్తుంది. మేషరాశి జాతకులు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.

మిధున రాశి
నవ పంచమయోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మిధున రాశి వారికి వారి నైపుణ్యానికి తగ్గట్టుగా కొత్త ఉద్యోగం లభిస్తుంది. ప్రారంభంలో సవాలుగా ఉన్న కొన్ని పనులు క్రమంగా పురోగతికి దారితీస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి మిధున రాశి వారికి ఇదే మంచి సమయం. గృహ, వాహన యోగాలు ఉన్నాయి.
సింహరాశి
నవ పంచమ యోగంతో సింహ రాశి వారికి కలిసొస్తుంది. స్థిరాస్తిలో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. అయితే వ్యాపారాలలో పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండడమే మంచిదని సూచించబడింది. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన చదువులు సాగిస్తారు. ఇది సింహరాశి వారికి మంచి ఫలితాలను ఇచ్చే సమయం.
కన్యారాశి
కన్య రాశి జాతకులకు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల, సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. భవిష్యత్తులో కన్యారాశి జాతకుల ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. ఈ సమయంలో ఏర్పడే కొత్త సంబంధాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇది అన్ని విధాలా ఆర్ధిక ప్రయోజనాలను చేకూర్చే సమయం.
మకర రాశి
నవ పంచమ యోగంతో మకర రాశి జాతకులు ఆర్థికపరమైన నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి నూతన అవకాశాలు లభిస్తాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాల పైన దృష్టి సారించాలి.
కుంభరాశి
నవ పంచమయోగంతో కుంభరాశి జాతకులకు కలిసొస్తుంది. కుంభరాశి జాతకుల కలలు ఈ సమయంలో సాకారం అవుతాయి. ఏ పని చేసినా కుంభరాశి జాతకులు ఈ సమయంలో విజయాలు సాధిస్తారు. ఇది కుంభరాశి వ్యాపారాలకు లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరికి తిరుగే ఉండదు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications