నవ పంచమ రాజయోగంతో వీరికి జాక్‌పాట్!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు చంద్రుడి కలయిక కారణంగా నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగం. ఈ శుభయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు నవ పంచమ రాజయోగంతో జాక్పాట్ ను అందుకుంటారు.
నవ పంచమ రాజయోగంతో విశేష ప్రయోజనాలు
కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఇదే సమయంలో కుజుడు గురుడుతో కలయిక జరపనున్నాడు. అంతేకాదు జూలై 22వ తేదీన సోమవారం కుజుడు, చంద్రుడుతో కలిసి నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీనివలన కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోతాయి.
సింహరాశి
నవ పంచమ రాజయోగం కారణంగా సింహరాశి వారికి లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో నూతన వాహన యోగం ఉంది. నూతన గృహాన్ని కొనే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అందరూ సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులకు పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులలో ఈ సమయంలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు సమస్యలు తొలగిపోతాయి. ఏదైనా నూతన పని ప్రారంభించాలనుకుంటే ఇదే సరైన సమయం. కుటుంబంతో స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఏ పని తలపెట్టిన ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయి.
మకర రాశి
నవ పంచమ రాజయోగం వలన మకర రాశి జాతకులకు శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి ఇది సరైన సమయం.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications