బృహస్పతి, సూర్యుల సంయోగంతో హోలీ తర్వాత వీరి పంట పండుతుంది
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో సూర్యుడు మరియు బృహస్పతిని ముఖ్యమైన గ్రహాలుగా చెబుతారు. అటువంటి సూర్య, బృహస్పతి లు కుంభరాశిలో సంయోగం చెంది మార్చి నెలలో నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. హోలీ తర్వాత నవ పంచమ రాజయోగం ఏర్పరిచి కొన్ని రాశులవారికి శుభాలను కలుగజేస్తుంది.
హోలీ తర్వాత నవపంచమ రాజయోగంతో లక్
మార్చి 5వ తేదీన రాత్రి 10:41నిమిషాలకు బృహస్పతి మరియు సూర్యుడు ఒకదానికొకటి 120 డిగ్రీల దూరంలో నవ, పంచమ స్థానాలలో ఉండడం వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. మరి హోలీ తర్వాత నవ పంచమ రాజయోగంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మీన రాశి
హోలీ తర్వాత ఏర్పడే నవ పంచమ రాజయోగం తో మీన రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు కొత్త ఆదాయ వనరులను చూస్తారు. పూర్వీకుల ఆస్తి ద్వారా గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ లోనూ ప్రయోజనాలను పొందుతారు. బృహస్పతి ఆశీస్సులతో కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇది మీన రాశి వారికి శుభాలను చేకూర్చే యోగం.
సింహరాశి
బృహస్పతి మరియు సూర్యుడి కారణంగా ఏర్పడే నవ పంచమ రాజయోగం సింహరాశి జాతకులకు అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం గణనీయంగా మారుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కెరీర్ పరంగా ఎదురు చూస్తున్న వారికి అనేక అవకాశాలు లభిస్తాయి. మీరు పని కోసం ప్రయాణం చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది.
మిధున రాశి
బృహస్పతి మరియు సూర్యుడి కారణంగా ఏర్పడే నవ పంచమ రాజయోగం మిధున రాశి జాతకులకు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు అనేక రంగాలలో వారికి మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టం మీ వైపే ఉంటుంది. జీవితంలో సంతోషం మరియు పురోగతి వేగంగా వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏదైనా పనిలోను, ప్రాజెక్టులను మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉన్నతాధికారులు మీకు సహకరిస్తారు.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications