కార్తీక పౌర్ణమి దీపాలు పెట్టేటప్పుడు అస్సలు ఈ తప్పులు చెయ్యొద్దు!
ఈరోజు కార్తీక పౌర్ణమి. శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీకమాసంలో జరుపుకునే కార్తీక పౌర్ణమికి చాలా విశేషం ఉంటుంది. ఈరోజు ఎవరైతే అత్యంత భక్తి భావంతో శివకేశవులను పూజిస్తారో, ఉపవాసం ఉండి కార్తీక దీపాలను వెలిగిస్తారో వారి జీవితం బాగుంటుందని, వారికి శివ సాయుజ్యం లభిస్తుందని చెప్తారు. అయితే కార్తీకమాసంలో, కార్తీకపౌర్ణమి నాడు పూజ చేసుకునే వారు, ముఖ్యంగా కార్తీకదీపం పెట్టే విషయంలో కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.
కార్తీక దీపాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు
కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేసేవారు సాయంత్రం వేళ దీపాలు వెలిగించాలి. బాగా రాత్రి అయిన తర్వాత దీపాలను వెలిగించకూడదు. ఇక దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో, లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఈ నూనెలు కాకుండా ఇతర నూనెలతో దీపారాధన చేస్తే ఏ మాత్రం మంచిది కాదు. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన పగలు చేయడం కంటే రాత్రి పూట చేయడమే శ్రేయస్కరం.

కార్తీక దీపాలు పెట్టేవారు పద్దతిని పాటించాలి
దీపం వెలిగించిన తర్వాత ఆకాశదీపం వద్ద శ్లోకం చెప్పడం ఇక 365 వత్తులను దీపారాధన చేసే వారు ఈ విషయంలో కూడా తగిన పద్ధతులను పాటించాలి. దీపారాధన చేయడం మాత్రమే కాకుండా దీపదానం చేయాలి. ఇక ఉసిరి దీపాలు వెలిగించే వారు కూడా కొన్ని పద్ధతులను పాటించాలి. ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు ఉసిరికాయ నిలబడాలని ఒత్తులు పెట్టడానికి వీలుగా ఉండాలని పైన కింద చిన్నగా కట్ చేసి పెడతారు.
ఇలా ఉసిరి దీపారాధన చేస్తే ఫలితం ఉండదు
కానీ పొరపాటున కూడా అలా ఉసిరికాయలను కట్ చేసి దీపం పెట్టకూడదు. ఉసిరికాయలను నిలబడడానికి బియ్యం లేదా ప్రమిదలో వాటిని పెట్టి అలాగే పైన ఒత్తు నిలబడడానికి కొద్దిగా పిండి పెట్టి ఒత్తులను తయారు చేసుకోవచ్చు. లేదా పిండిని ప్రమిదలా తయారుచేసి ఉసిరికాయ పైన ఉంచి అందులో ఆవు నెయ్యితో వత్తులను వేసి వెలిగించవచ్చు. ఇలా కాకుండా ఉసిరి కాయలు కట్ చేసి పెడితే అస్సలు దీపారాధన చేసిన ఫలితం రాదు.
365ఒత్తులు వెలిగిస్తున్నారా? అయితే ఇలా చెయ్యండి
కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులను వెలిగించేవారు రెండు కట్టలను వెలిగించాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం దీపారాధన చేసేటప్పుడు రెండు దీపాలను పెడతాము. ఇక సంవత్సరం అంతా పూజలు చేసిన వారు ఈ ఒక్క రోజు 365 వత్తులను వెలిగిస్తే సంవత్సరం పూజ చేసిన ఫలితం వస్తుందని భావిస్తారు కాబట్టి, అటువంటి వారు రెండు 365 కట్టల ఒత్తులను కలిపి వెలిగిస్తే నే ఫలితం ఉంటుంది. ఈ విషయం అసలు మర్చిపోవద్దు.












Click it and Unblock the Notifications