నిర్జల ఏకాదశి.. లక్ష్మీకటాక్షం కావాలంటే తులసిమొక్క దగ్గర పొరబాటున కూడా ఇలా చెయ్యకండి
హిందూమతంలో ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏకాదశిని హిందువులు పరమ పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో వస్తాయి. అయితే జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి జూన్ 18వ తేదీన వచ్చింది. నిర్జల ఏకాదశి అంటే కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేసే రోజు.
నిర్జల ఏకాదశి.. తులసి మొక్కకు సంబంధం
నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. నిర్జల ఏకాదశి రోజు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన తులసిమొక్క వద్ద పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. నిర్జల ఏకాదశికి తులసిమొక్కకు ఉన్న సంబంధం ఏమిటి? ఆరోజు తులసిమొక్క వద్ద ఏమి చేయకూడదు? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తులసి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
హిందువులు లక్ష్మీదేవి తులసి చెట్టు లో నివసిస్తున్నదని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేస్తుందని చెబుతారు. అందుకే ఈ రోజు తులసి మొక్కకు పొరపాటున కూడా నీళ్లు పోయకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులను ఎప్పుడు తుంచకూడదు. తులసి ఆకులు ఎప్పుడు అవసరమైనా ఏకాదశి రోజు కాకుండా అంతకు ముందు రోజు మాత్రమే తుంచి పెట్టుకోవాలి. తులసి ఆకులను తుంచే క్రమంలో గోళ్లతో గిల్లడం మహాపాపం.
తులసి వద్ద పాటించాల్సిన నియమాలివే
తులసి ఆకులు తుంచడానికి ముందు తులసి మొక్కకు నమస్కరించి మరీ తుంచాలి. మురికి చేతులతో లేదా మైల పడిన శరీరంతో, స్నానం చేయకుండా ఎప్పుడు తులసి ఆకులను తాకకూడదు. ఒక వేళ అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీ దేవికి కోపం వస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది.
తులసి మొక్క పరిసరాలు ఇలా ఉండకుండా చూసుకోండి
నిర్జల ఏకాదశి నాడు తులసి మొక్క ఉన్న చోట మురికి ఉండకుండా చూసుకోవాలి. తులసి మొక్క పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలి. ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాసం చేస్తుంది కాబట్టి అమ్మవారికి కనీసం నీళ్లను కూడా సమర్పించకూడదు.పొరపాటున కూడా తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు, బూట్లు విప్పకుండా చూసుకోవాలి.
నిర్జల ఏకాదశి నాడు తులసి విషయంలో జాగ్రత్త
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టంగా, పరమపవిత్రంగా భావించే తులసి మొక్కను ఆ రోజు మంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. అందుకే నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఉపవాస దీక్షను ఆచరించి లక్ష్మీదేవిని పూజిస్తే నిర్జల ఏకాదశి విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications