సుబ్రమణ్యస్వామిని ఆరాధించాలి.. మాటకు విలువ పెరుగుతుంది
గ్రహాలు నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఎదురైతే, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా ఈ వారం ఎలా ఉంది? ప్రతికూలతలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? తదితర విషయాలపై వారఫలాలను తెలుసుకుందాం.
తులా రాశి
గురు, శుక్ర గ్రహాల బలాలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ధనయోగం ఉంది. తీసుకునే మంచి నిర్ణయాలు ధర్మచింతనతో తీసుకోవాలి. పనులు వాయిదా వేయొద్దు. మిత్ర భావంతో అందరినీ కలుపుకుపోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభం జరుగుతుంది.

వృశ్చిక రాశి
ఏకాగ్రతతో పనులు ప్రారంభించాలి. నిర్ణయాల్లో చంచలత్వం పనికిరాదు. బాధ్యతలు పూర్తిచేయాలి. దేనికీ తొందర పనికిరాదు. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.
ధనుస్సు రాశి
మంచి ఫలితాలున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికార యోగం ఉంది. సమస్యలు తొలగిపోతాయి. స్థిరత్వం ఉంది. కొత్తగా పెట్టే పెట్టుబడులు కలిసివస్తాయి. మహాలక్ష్మీదేవిని స్మరించడంవల్ల కార్యసిద్ధి ఉంటుంది.
మకర రాశి
అధికారుల అండ లభిస్తుంది. బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి. ఆశించిన ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులను ఆపకూడదు. మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల సహకారంతో పనిని పూర్తిచేస్తారు. సుబ్రమణ్యస్వామిని ఆరాధించాలి.
కుంభరాశి
చెడును ఊహించవద్దు. కాలం మిశ్రంగా ఉంది. ఉద్యోగంలో పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. సమష్టి కృషి ఫలిస్తుంది. నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకోవాలి. ఒత్తిడిలో ఖర్చు పెరగకుండా జాగ్రత్తపడాలి. విష్ణు సహస్రనామం చదువుకుంటే వెంటనే విజయం అందుకుంటారు.
మీనరాశి
సకాలంలో పనులు ప్రారంభించాలి. ధైర్యంగా నిర్ణయాలను అమలు పరచాలి. కర్తవ్యాల్ని బాధ్యతాయుతంగా పూర్తిచేసి ప్రశంసలు అందుకుంటారు. పూర్వపుణ్యం ఎప్పుడూ కాపాడుతుంటుంది. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కాలం వ్యతిరేకంగా ఉండటంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శివ సహస్ర నామాన్ని చదవండి.. కార్యసిద్ధి లభిస్తుంది.












Click it and Unblock the Notifications