వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మకర సంక్రాంతి నాడు ఈ దానాలు తెస్తాయి మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం.. ప్లాన్ చేసుకోండి!!

|
Google Oneindia TeluguNews

పండుగలు ఏవైనా సరే దానధర్మాలను చేయడం శుభసూచకంగా పరిగణిస్తారు. ఇక అందులోనూ మకర సంక్రాంతి పర్వదినాన దానధర్మాలు చేయడం మంచిదని ఎంతో మంది పండితులు చెబుతున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా స్నానాలు చేయడం, ఆ తర్వాత దానాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

సంక్రాంతి నాడు ముఖ్యంగా దానం చెయ్యాల్సినవి ఇవే

సంక్రాంతి నాడు ముఖ్యంగా దానం చెయ్యాల్సినవి ఇవే

ముఖ్యంగా మకర సంక్రాంతి పుణ్యదినాన ఉదయాన్నే స్నానం చేసి, దానధర్మాలను చేసి సూర్యుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయని, అనేక దోషాలు తొలగిపోతాయని చెబుతారు. మకర సంక్రాంతి పుణ్యదినాన దానం చేయవలసిన వస్తువుల విషయానికి వస్తే సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. నల్ల నువ్వులు లేకుంటే తెల్ల నువ్వులను దానం చేయొచ్చు. నువ్వులను దానం చేయడం వల్ల శనికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతున్నారు. సూర్య భగవానుడు శని ఇంటికి చేరుకున్నప్పుడు శని నువ్వులతో సూర్యుడుకి స్వాగతం పలికాడు అని అందుకే నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం వల్ల జాతకం పైన తగ్గుతుందని చెబుతున్నారు.

సంక్రాంతి నాడు ఈ వస్తువులు దానం చేస్తే రాహువు దోషం తొలగిపోతుంది.

సంక్రాంతి నాడు ఈ వస్తువులు దానం చేస్తే రాహువు దోషం తొలగిపోతుంది.


ఇక మకర సంక్రాంతి పుణ్యదినాన దానం చేయవలసిన మరొక వస్తువు దుప్పట్లు. జాతకంలో రాహవు గ్రహ ప్రభావం ఉన్నవారు మకర సంక్రాంతి రోజున దుప్పట్లు దానం చేయడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుందని, దోషం తొలగి పోయి సానుకూల ప్రభావం మనపై కలుగుతుందని చెబుతున్నారు. పేదసాదలకు బట్టలు, దుప్పట్లు దానం చేయడం మంచిదని చెబుతున్న పరిస్థితి ఉంది.

ఈ ఆహార పదార్ధాలు దానం చేస్తే అన్నీ శుభాలే

ఈ ఆహార పదార్ధాలు దానం చేస్తే అన్నీ శుభాలే

ఇక మకర సంక్రాంతి రోజున దానం చేయవలసిన మరొక వస్తువు పొట్టు మినప్పప్పు. నల్లని మినప గుళ్ళు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని, జాతకంలో శని దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా సంక్రాంతి నాడు కిచిడి ని దానం చేయడం వల్ల కూడా దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయని చెబుతున్నారు. పెసరపప్పుతో చేసిన కిచిడీ వల్ల బుధ గ్రహానికి సంబంధించిన దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుందని చెబుతున్నారు కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ దానాలు చేయడం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

సూర్యుడు మన జాతకంలో బలంగా ఉండాలంటే ఇది దానం చెయ్యండి

సూర్యుడు మన జాతకంలో బలంగా ఉండాలంటే ఇది దానం చెయ్యండి

మకర సంక్రాంతి నాడు దానం చేయాల్సిన మరొక వస్తువు బెల్లం. బెల్లాన్ని దానం చేస్తే సూర్యునికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని, అలాగే బృహస్పతి శని దోషాలను కూడా బెల్లం తొలగిస్తుందని చెబుతున్నారు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటామని, అందుకే సూర్యుడు బలంగా ఉండటం కోసం బెల్లాన్ని దానం చేయడం మంచిదని చెబుతున్నారు.

చంద్ర దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే ఇది దానం చెయ్యండి

చంద్ర దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే ఇది దానం చెయ్యండి

ఇక మకర సంక్రాంతి పుణ్యదినాన అన్నదానం చేయాలని చెబుతున్నారు. తెల్లని బియ్యంతో చేసిన అన్నదానం చంద్రుడి దోషాలను జాతకంలో ఉంటే తొలగిస్తుందని అంటున్నారు. మన జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలంటే సంతోషాన్ని, శ్రేయస్సును ఇవ్వాలంటే అన్నదానం చేయడం మహోన్నతమైన దానంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే మకర సంక్రాంతి నాడు చేసే దానాలు మన జీవితంలో సూర్యుడి అనుగ్రహానికి కారణమవుతాయని అంటున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
On Makar Sankranti it is good to donate black sesame seeds, black gram dal, kichidi, blankets, jaggery and annadanam. It is said that these will give you wealth and health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X