రాఖీ పండుగనాడు ఆకాశంలో అద్భుతం, శుభయోగాలు.. వీరికి సిరిసంపదలు!

ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ జరుపుకోనున్నాము. ఈ సంవత్సరం రాఖీ పండుగ రోజున ఆకాశంలో అద్భుతమైన దృశ్యంగా బ్లూ మూన్ కనిపించబోతోంది. అంతేకాదు 16 కళలతో నిండిన బ్లూ మూన్ శని రాశిలో ఉంటాడు. ఇక రాఖీ పండుగ రోజున రవి యోగం, సర్వార్ధ సిద్ధియోగం, శోభనయోగం, శ్రవణా నక్షత్రాల కలయిక జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులతో ఈసారి రాఖీ పండుగ చాలా ప్రత్యేకంగా చెప్పవచ్చు.

రాఖీ పండుగనాడు బ్లూ మూన్
ఇక రాఖీ పండుగ నాడు గ్రహాల సంచారం శుభ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ లేదా బ్లూ మూన్ ఏర్పడుతుంది. ఇది చాలా పెద్దదిగాను చాలా ప్రకాశవంతంగానూ కనిపిస్తుంది. ఇది రెండు రోజులపాటు కనువిందు చేస్తుంది. ఇక మూడవ రోజు నుండి బ్లూ మూన్ పరిమాణం క్రమంగా తగ్గుతూ వస్తుంది.

On Rakhi festival blue moon with auspicious yogas gives wealth to these zodiac signs

బ్లూ మూన్ అద్భుతం
బ్లూ మూన్ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆగస్టు 19వ తేదీన సాయంత్రం 6 గంటల 56 నిమిషాలకు చంద్రోదయం జరగా మరుసటి రోజు ఉదయం చంద్రుడు అస్తమిస్తాడు. ఇక రాత్రి చంద్రుడు 11 గంటల 55 నిమిషాలకు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో చంద్రుడు మకర రాశి నుంచి కుంభ రాశి వరకు తన ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.

శుభయోగాలు, బ్లూ మూన్ తో ఈ రాశులవారికి విశేష ఫలితాలు
ఇక ఈ సంవత్సరం రాఖీ పండుగ రోజున శష రాజయోగం, బుధాదిత్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, విశ రాజయోగం, కుబేర యోగాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇక రాఖీ పండుగ రోజు వచ్చే రాజయోగాలు, బ్లూ మూన్ కారణంగా కొన్ని రాశులవారికి విశేష ఫలితాలు వస్తాయి.

ఈ రాశులవారికి సిరిసంపదలు
మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి అనుకోని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వీరి కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి సిరిసంపదల ప్రాప్తి కలుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+