వీరికి తిరుగేలేదని చెప్పిన పంచ దివ్య రాజయోగం.. ఇక తగ్గేదేలే!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను నిర్దేశిస్తాయి. వివిధ గ్రహాల సంయోగం కారణంగా రాజయోగాలు ఏర్పడతాయి. అయితే కొన్ని రాజయోగాలు శక్తి మరియు హోదా శ్రేయస్సును తీసుకుని వస్తాయి. అయితే జూన్ మాసంలో ఐదు మహాపురుష రాజయోగాలు తో పంచ దివ్య రాజయోగం ఏర్పడింది.
పంచ దివ్య రాజయోగంతో అదృష్ట రాశులు
జూన్ 24వ తేదీన అరుదైన ఐదు మహాపురుష రాజ యోగాలతో పంచ దివ్య రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. జూన్ 24వ తేదీన గజకేసరి రాజయోగం, భద్ర రాజయోగం, మహాలక్ష్మి రాజయోగం, బుధాదిత్య రాజయోగం, మాలవ్య రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ పలితాలు మొదలయ్యాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి
పంచ దివ్య రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు వృత్తిపరంగా కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఇంక్రిమెంట్లు పొందుతారు. పనిచేసే చోట నూతన ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి . వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మిధునరాశి
పంచ దివ్య రాజయోగం కారణంగా మిధునరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.మిధునరాశి వారుఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లు వస్తాయి.వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమైన వారికి మంచి ఫలితాలు వస్తాయి. విద్యావేత్తలు, రచయితలు, విద్యార్థులకు ఇది మంచి సమయం. మిధునరాశి వారికి ఈ పంచ దివ్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది.
కుంభరాశి
పంచ దివ్య రాజయోగంలో కుంభరాశి వారికి శుభ ఫలితాలు వస్తున్నాయి. కుంభరాశి జాతకులు ఈ సమయంలో అన్ని విధాలా పురోగతిని సాధిస్తున్నారు. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న వారికి అవకాశాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications