సోమావతి అమావాస్యతో నేటి నుండి ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
నేడు సోమావతి అమావాస్య. సోమవారం రోజు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అంటారు. ఈ సోమవతి అమావాస్య శివ కేశవులకు అత్యంత ఇష్టమైన రోజు. నేడు ఉదయం నాలుగు గంటలకు సోమావతి అమావాస్య ప్రారంభమై డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల 56 నిమిషాలకు ముగుస్తుంది.
అనేక విశేష యోగాల సోమావతి అమావాస్య
ఈ సోమావతి అమావాస్య హిందూమతంలో చాలా విశిష్టమైనది. ఈ సోమావతి అమావాస్యనాడు ధ్రువయోగం, ధృతి యోగం, స్వాతి నక్షత్రం, శివవాసాల ప్రత్యేక కలయిక జరుగుతున్న కారణంగా నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ నాలుగు రాశులు నేటినుంచి శివుడి యొక్క కటాక్షాన్ని పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
సోమావతి అమావాస్య వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈరోజు నుంచి వృషభ రాశి జాతకులకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇది వీరికి సంతోషాలకు స్వాగతం పలికే కాలం.
కన్యారాశి
సోమావతి అమావాస్య కన్యారాశి వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగులు మంచి విజయాలను సాధించే సమయం ఇది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మానసికంగాను ప్రశాంతంగా ఉంటారు.
తులారాశి
తులా రాశి వారికి నేటి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి. తులా రాశి వారి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. . వివాహితులు శుభవార్తలు వింటారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి నేటి నుంచి కెరీర్ లో సానుకూల మార్పులు ఉంటాయి. కొత్త వ్యక్తులను కలవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తుంది. ఆస్తిపరంగా ఆర్థికంగా లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో కొన్ని శుభవార్తలను వింటారు.












Click it and Unblock the Notifications