పితృపక్షంలో ఈ నాలుగు వస్తువులు కొనొద్దు .. కొంటే అనారోగ్యం, అకాలమరణం.. జాగ్రత్త!!

పితృపక్షం.. మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలం. ఈ సమయంలో పూర్వీకులు తమ వారిని కలుసుకోవటానికి భూమి మీదకు వస్తారు. పితృ పక్షం 16 రోజుల కాలం. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు. ప్రస్తుతం పితృపక్షాలు కొనసాగుతున్నాయి.

పితృపక్షం సమయంలో పూర్వీకులు సంతోష పడేలా చెయ్యవలసిన కర్మలను చెయ్యాలి. హిందూ మతాన్ని విశ్వసించేవారు పితృ పక్షంలో తమ పూర్వీకులకు గౌరవాన్ని ఇస్తారు. ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 29వ తేదీ నుండి ప్రారంభమైంది. పితృపక్షం సందర్భంగా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని భావించేవారు, కొన్ని పనులు చేయటం, కొన్ని వస్తువులను కొనటం నిషిద్ధం అని చెబుతున్నారు.

 Pitrupaksam 2023

పితృ పక్షం సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదని ఒకవేళ అలా కొనుగోలు చేస్తే త్రి దోషం వస్తుందని చెబుతున్నారు. మరి పితృపక్షం సమయంలో కొనుగోలు చేయకూడని వస్తువులను గురించి తెలుసుకుందాం. పితృ పక్షం సమయంలో పొరపాటున కూడా ఉప్పును కొనుగోలు చేయకూడదు. పితృ పక్షం సమయంలో ఉప్పును కొనుగోలు చేస్తే పితృ దోషం కలుగుతుందని చెబుతారు. అది మీకు ఆర్థిక సమస్యలను తీసుకువస్తుందని చెబుతున్నారు.

పితృపక్షం రోజులలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవాలను, ఆవనూనెను కొనుగోలు చేయకూడదు. ఒకవేళ పొరపాటున ఆవనూనె పితృ పక్షాల సమయంలో కొనుగోలు చేస్తే ఇంట్లో మనశ్శాంతి పోతుందని, దరిద్రం పడుతుందని చెబుతున్నారు. పితృపక్షం సమయంలో చీపురుని కూడా కొనుగోలు చేయకూడదు. ఒకవేళ చీపురును కొనుగోలు చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెబుతున్నారు.

పితృ పక్షం సమయంలో కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. పితృ పక్షం సమయంలో కొత్త బట్టలు కొనుగోలు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. ఈ రోజుల్లో మీరు బట్టలు దానం చేయవచ్చు కానీ, కొనుగోలు మాత్రం చేయకూడదు. పొరపాటున పితృపక్షం రోజులలో ఈ నాలుగు వస్తువులను కొనుగోలు చేస్తే వారికి త్రి దోషం వస్తుందని చెప్తునారు.

త్రిదోషం కారణంగా అనారోగ్యం, అకాల మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి త్రిదోషం నుండి బయట పడాలంటే పితృ పక్షాల సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయకూడదు. మర్చిపోకండి. పితృదేవతలు సంతృప్తి చెందేలా, వారి ఆశీస్సులు మీపై ఉండేలా స్నాన, దాన, తర్పణ కర్మలను నిర్వహించండి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+