అన్నం తిన్న ప్లేట్ లోనే చేయి కడుగుతున్నారా?

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. మనం తినే అన్నాన్నే కాకుండా ఎందులో అయితే వడ్డించుకొని తింటున్నామో ఆ ప్లేటును కూడా గౌరవించాలి. కొందరు అన్నం తినడంలోనే తప్పులు చేస్తుంటారు. వాటివల్ల ఏం జరుగుతుందో తెలుసుకోరు. భోజనం చేయడానికి ముందు, చేసే సమయంలో, చేసిన తర్వాత కొన్ని నియమాలుంటాయి. వీటిని మనం తెలుసుకోవాలి.

రోజుకు మూడుసార్లు మనం తప్పు చేస్తున్నామంటే జీవితకాలంలో ఎన్నిసార్లు, ఎంత పెద్ద తప్పవుతుందో అర్థం చేసుకోవాలి. చాలామంది అన్నం తిన్న ప్లేట్ లోనే చేతులను కడుగుతుంటారు. అయితే ఇలా చేయడం సరికాదని మన పురాణాలు చెబుతున్నాయి. చేతితో అన్నం తిన్నా, స్పూన్ తో అన్నం తిన్నా తిన్న ప్లేట్ లో చేయి కడగకూడదు. ఇలా చేస్తే అన్నపూర్ణతోపాటు లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది. మనం తినే ఆహారం ఎంతో పవిత్రమైంది. అలాంటి ఆహారాన్ని తిన్న ప్లేట్ లోనే చేతులు ల కడగడం అంటే పాపంతో సమానం.

principles and tips for a happy life

అన్నంతో నిండిన ప్లేట్ ను ఒకచేత్తో పట్టుకోకూడదు. ఇలా చేయడంవల్ల అన్నపూర్ణను, లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. అలాంటివారికి ఆహారం, డబ్బు ఉండదని చెబుతుంటారు. అందుకే భోజనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలను పాటిస్తుండాలి. అన్నంతినేటప్పుడు తింటున్న అన్నంపైనే దృష్టిపెట్టాలి. పూర్వకాలంలో కుటుంబ సభ్యులంతా ఒకేచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్లు. ఇప్పుడు టేబుల్స్ పై కూర్చొని తింటున్నారు. మరికొందరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. కొందరు పుస్తకాలు చదువుతూ తింటారు. ఇలా చేయడమనేది తినే అన్నాన్ని అవమానించినట్లవుతుంది.

బోజనం చేసే సమయంలో మన ధ్యాస మొత్తం తినే ఆహారంపైనే ఉంచాలి. శ్రద్ధగా భోజనం చేయాలి. కోపాలు, ఆవేశాలు పడకుండా ప్రశాంతంగా అన్నం తినాలి. మనం ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేటప్పుడు ఇప్పుడే అన్నం తింటున్నాను అని చెబితే అందరూ తిన్న తర్వాతే చేయండి అంటారు. డిస్ట్రబ్ చేయకూడదని అర్థం ఎంత ఇష్టంగా తింటున్నారో అని అన్నపూర్ణ సంతోషిస్తుంది. అన్నపూర్ణాదేవి సంతోషిస్తే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఆ ఇంటిని తాకలేవు. ఇష్టం లేని కూర వండామని ముఖం సీరియస్ గా పెట్టుకొని అన్నం తింటుంటారు. అలా చేయకూడదు. అది ఆ ఒక్క పూటకు మాత్రమే. ఆ మాత్రం దానికే ఆస్తులు పోయినట్లు ప్రవర్తిస్తుంటారు. ప్రేమగా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో తినేవారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఈ తరహా తప్పులు మీరేమైనా చేస్తుంటే వెంటనే ఆ అలవాట్లు మానుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+