త్వరలో ఈ రాశులవారికి సంపదల సునామీ ప్రకటించిన రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా చెడు చేసే గ్రహంగా భావిస్తారు. అయితే మే 18 2025న రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.
కుంభరాశిలో రాహు సంచారం
రాహువు సుమారు 18 నెలల పాటు కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఆపై డిసెంబరు 2026 వరకు రాహువు కుంభరాశి లోనే ఉంటాడు రాహువును చాలా క్రూరమైన గ్రహంగా పరిగణించినప్పటికీ రాహు సంచారం కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలను, సువర్ణ అవకాశాలను తెస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
కుంభరాశిలో రాహువు సంచారం సమయంలో మేషరాశిలో రాహువు 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మేష రాశి జాతకులకు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వీరి ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
వృషభరాశి
కుంభరాశిలో రాహు సంచారం సమయంలో వృషభ రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి అన్ని సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఈ సమయంలో వారు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా జీవిస్తారు. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. ఊహించని ధన లాభం కలుగుతుంది.
సింహరాశి
కుంభరాశిలో రాహు సంచారం సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వీరి జీవితం ఈ సమయంలో సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి యొక్క మూడవ ఇంట్లో రాహుసంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. కెరీర్లో పెద్ద విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అన్నింటినీ సాధించగలుగుతారు.
కుంభరాశి
కుంభరాశిలో రాహు సంచారం కారణంగా కుంభ రాశి వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయం కుంభరాశి జాతకులకు బంగారు కాలం. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది. కృషికి తగిన ఫలితం వస్తుంది. 2025 నుంచి వచ్చే రెండున్నర సంవత్సరాలు కుంభరాశి జాతకులకు తిరిగే ఉండదు. ఆస్తులు, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేసే చోట కూడా అపారమైన విజయాలను పొందుతారు. వారి కెరీర్ కు ఈ సమయం అనుకూలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications