పూర్వాభాద్రపద నక్షత్రంలో రాహువు.. ఈ రాశులవారికి జాక్ పాట్!
వేద జ్యోతిషశాస్త్రంలో రాహువును క్రూరమైన గ్రహంగా, నీడ గ్రహంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే రాహువు స్థానం బలహీనంగా ఉంటుందో వారికి ప్రతికూలఫలితాలు ఎదురవుతాయి. రాహువు సెప్టెంబర్ 21వ తేదీన 11.50నిమిషాలకు పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ స్థానానికి గురువు అధిపతిగా ఉండటం వల్ల, రాహువు గురువు ప్రభావంతో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రాహువు కారణంగా ఏ రాశులవారికి శుభఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
సెప్టెంబర్ మాసంలో రాహువు పూర్వాభాద్ర పద నక్షత్రంలో సంచారం చేయడం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మేష రాశి వారి వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితంలో ఎదురయ్యే వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 21 నుండి మేష రాశి వారికి ఆదాయం పెరుగుతుంది.

వృషభ రాశి
సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి జాతకులకు రాహువు సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృషభ రాశి వారు ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు సంబంధిత కేసుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు.
తులారాశి
సెప్టెంబర్ నెలలో తులారాశి జాతకులు రాహువు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం వల్ల లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో వీరు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాముల నుంచి సహకారం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
కుంభరాశి
రాహువు ప్రభావంతో సెప్టెంబర్ నెలలో కుంభ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కుంభ రాశి వారు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సమయం అద్భుతంగా ఉంటుంది. కుంభ రాశి వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications