2025లో వీరికి దరిద్రాన్ని, కష్టాలను తీసుకొస్తున్న రాహువు.. జాగ్రత్త!
2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారంతో పాటు నీడ గ్రహాల సంచారం కూడా అన్ని రాశుల వారి జీవితాలను మారుస్తాయి. 2025 లో రాహువు సంచారం కీలకంగా మారిపోతుంది. రాహు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తుంటే మరికొన్ని రాశుల వారు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
రాహువు మీనరాశి సంచారం
2025 సంవత్సరం మే నెలలో రాహువు మీనరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఏడాదిన్నర పాటు కొన్ని రాశుల వారికి సమస్యలు వస్తాయి. 2025 సంవత్సరంలో వివిధ సమయాలలో జాతకంలో చెడు స్థానాలలో రాహువు ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలను పొందే రాశుల వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
2025లో రాహువు కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే మొదటి రాశి కర్కాటక రాశి . రాహువు కర్కాటక రాశిలో ఎనిమిదో స్థానంలో ఉండటం వలన ఇబ్బందులు వస్తున్నాయి. రాహువు అడుగడుగునా మీ పనులకు ఆటంకాలు కూడా కలిగిస్తాడు. కర్కాటక రాశి వారి కుటుంబ జీవనంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వాముల మధ్య అవగాహన లోపంతో ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త వహించాలి.
సింహరాశి
రాహువు కారణంగా 2025లో ఇబ్బంది పడే మరో రాశి సింహ రాశి. రాహువు ఈ రాశిలో ఏడో స్థానంలో సంచరిస్తున్నాడు. వారి జీవితంలో సుఖానికి, సౌకర్యానికి కొరత ఏర్పడుతుంది. సింహ రాశిలో రాహువు వారి ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహువు సింహ రాశి జాతకులు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావం చేస్తాడు. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.
తులారాశి
2025 సంవత్సరంలో రాహువు తులా రాశిలో ఐదవ స్థానంలో ఉంటున్నాడు. 2025లో తులారాశి జాతకుల జీవితాలలో అనేక సమస్యలు వస్తాయి. ఈ కాలంలో ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఇది తులా రాశి జాతకులకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో చేసిన ప్రయాణాలు కూడా అశుభ ఫలితాలను ఇస్తాయి. ఈ కారణంగా ప్రయాణాల విషయంలో కూడా కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications