అక్టోబర్ లో ముగియనున్న రాహు గురు సంయోగం; వీరికి తెరుచుకోనున్న అదృష్ట ద్వారం!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క ప్రభావం రాశీ చక్రాల వారి జాతకాలపై గణనీయంగా పడుతుంది. ప్రస్తుతం మేషరాశిలో రాహువు గురు గ్రహ సంయోగం జరుగుతుంది. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ సంయోగం అక్టోబర్ 30వ తేదీన ముగియబోతుంది. సహజంగా రాహు గురు సంయోగాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు.

రాహు గ్రహ గురు సంయోగం ముగిసే సమయం రాబోతున్న తరుణంలో, రాహు గురు సంయోగం ముగిసిన తరువాత అదృష్టాన్ని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. రాహువు గురు సంయోగం జ్యోతిషంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇది మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వ్యక్తుల జీవితాలలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఈ ఖగోళ ప్రవర్తన వల్ల ఆర్థిక వృద్ధి, కెరీర్ పురోగతి కనిపిస్తుంది.

 Rahu Jupiter conjunction will end in October; luck for these zodiac signs!!

మేష రాశి
మేష రాశి జాతకులు రాహువు గురుగ్రహ సంయోగం ముగిసిన తర్వాత అనేక సమస్యల నుండి వీరు విముక్తిని పొందుతారు. మరింత అనుకూలమైన ఆర్థిక పరిస్థితులను ఈ సమయంలో వారు ఊహించవచ్చు. మేషరాశి జాతకులు గణనీయమైన ప్రతిఫలాలను పొందుతారు. సామాజికంగాను గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగార్ధులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. వివాహ అవకాశాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది.

సింహరాశి
సింహ రాశి వారికి గురు రాహు గ్రహ సంయోగ ముగింపు అదృష్టాన్ని తీసుకువస్తుంది. రాహు గురు గ్రహ సంయోగ ముగింపు తర్వాత సింహరాశికి మరింత సంపన్నమైన దశ వస్తుంది. ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంది. వృత్తిపరమైన జీవితంలో సింహ రాశి వారు మెరుగుదల చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు రాహు గురు గ్రహ సంయోగం ముగింపు సత్ఫలితాలను ఇస్తుంది .ధనస్సు రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసొస్తుంది.ధనుస్సు రాశి జాతకుల కెరీర్ లో మెరుగైన అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. భవిష్యత్ వృద్ధికి, శ్రేయస్సుకు మార్గం సుగమమవుతుంది. ధనుస్సు రాశి వారి జీవితాలలో సానుకూల మార్పులు వస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+