రాహు-కేతువుల సంచారం... 2025 వరకు ఈ రాశులకు తీరని కష్టాలు.. ఆర్ధికనష్టాలు
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులను నీడ గ్రహాలుగా చెబుతారు. రాహుకేతువులు ఎప్పుడు సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. 18 నెలలకు ఒకసారి రాహుకేతువులు తమ రాశి చక్రాలను మారుస్తూ ఉంటాయి. 2023 అక్టోబర్లో రాహుకేతువులు తమ రాశులను మార్చుకున్నాయి.
రాహు కేతువుల సంచారంతో కొన్ని రాశులకు అశుభం
2023అక్టోబర్లో రాహువు మీన రాశిలోకి, కేతువు కన్యా రాశిలోకి ప్రవేశించారు. 2025సంవత్సరం వరకు రాహుకేతువులు ఈ రెండు రాశులలోనే ఉంటాయి. ఇక 2025సంవత్సరంలో రాహు కేతువులు మళ్ళీ రాశులను మార్చుకుంటాయి. రాహువు కుంభరాశి లోను, కేతువు సింహరాశి లోను సంచరిస్తారు. ప్రస్తుతం రాహు కేతువుల సంచార క్రమంలో ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉన్నాయి. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
రాహు కేతు సంచారం కారణంగా వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఏ పని పూర్తి చేద్దాం అన్నా ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. జీవితంలో ఊహించని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ జీవితం కష్టాలతో కూడుకొని ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.
కన్యారాశి
రాహు కేతువుల సంచారం కారణంగా కన్యా రాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉండదు. ఆర్థిక పరిస్థితులలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ధన నష్టాన్ని చూడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
కర్కాటక రాశి
రాహు కేతువుల సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి కష్టాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. ఉద్యోగం చేసుకునే వారు సహోద్యోగులతో గొడవలు పడే పరిస్థితి ఉంటుంది. తీవ్ర ఆర్థిక సమస్యలను ఈ సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన మానసిక ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి. పని పైన శ్రద్ధ తగ్గుతుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు రాహు కేతువుల సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఉద్యోగం చేసే వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు చిరాకు కలిగిస్తాయి. మానసికంగా వేదన అనుభవించాల్సి వస్తుంది. సంతానం వైపు నుండి కూడా ఇబ్బందులే ఉంటాయి. కుటుంబ జీవితంలో అశాంతి నెలకొంటుంది. వైవాహిక జీవితం అనేక సమస్యలతో కూడుకుని ఉంటుంది.
మీన రాశి
రాహు కేతువుల సంచారం కారణంగా మీనరాశి జాతకులు కష్టాలను చూడవలసి వస్తుంది. ఆఫీస్ రాజకీయాలు మీ పని మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్థిక విషయాలలో కుటుంబంలో గొడవలు జరుగుతాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు నష్టాలను చేకూరుస్తాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండకుంటే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications