2025లో వీరికి డబ్బుల మూటలను సిద్ధం చేస్తున్న రాహు కేతువులు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నీడ గ్రహాలుగా చెప్పబడే రాహుకేతువులను సాధారణంగా చెడు చేసే గ్రహాలుగా చెబుతారు. అయితే రాహుకేతువులు జాతకంలో శుభ స్థానాలలో ఉంటే రాశులవారికి శుభ ఫలితాలు కూడా వస్తాయి.
మే 18వ తేదీన రాహు కేతువుల సంచారం
జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం 2025 సంవత్సరం నుంచి రాహు కేతువుల పుణ్య ఫలాలు కొన్ని రాశులవారి జీవితానికి అదృష్టాన్ని ఇస్తున్నాయి. 2025లో రాహువు కేతువులు మే 18వ తేదీన తమ రాశులను మారుస్తున్నారు. రాహువు తిరోగమనంలో కుంభరాశిలో ప్రవేశిస్తే, కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. కొన్ని రాశులవారు ఈ సమయంలో చాలా సంతోషంగా జీవిస్తారు. రాహు, కేతువుల కారణంగా 2025లో లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
రాహు కేతువుల సంచారం మిధున రాశి వారికి 2025 లో లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా మిధున రాశి వారు లబ్ధిని పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది .జీవితంలోని ప్రతి రంగంలోనూ మిధున రాశి వారికి కలిసి వస్తుంది.
మకర రాశి
2025 లో రాహు కేతువుల సంచారం కారణంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఆశించిన విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో మకర రాశి వారికి అదృష్టం తోడుగా ఉంటుంది. ఏది కావాలన్నా సరే ఈ సమయంలోనే దొరుకుతుంది.
కుంభరాశి
రాహు కేతువుల సంచారం కుంభరాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. 2025 లో కుంభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభ రాశి వారి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వీరికి సామాజికంగా పేరు ప్రతిష్ఠులు పెరుగుతాయి. వాహనాలు లేదా భూములను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుంభ రాశి వారు సంతానం నుండి శుభవార్తలను అందుకుంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications