2025లో వీరికి డబ్బుతో పాటు కీర్తిని అనుగ్రహించిన రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువును దుష్ట గ్రహంగా భావిస్తారు. రాహువు శని గ్రహం వలె నెమ్మదిగా కదిలే గ్రహం. రాహువు ఎల్లప్పుడు తిరోగమన సంచారం చేస్తాడు. ఏదైనా రాశిలోకి ప్రవేశించిన రాహువు 18 నెలల పాటు అదే రాశిలో ఉంటాడు. ప్రస్తుతం బృహస్పతి రాశి చక్రం అయిన మీనరాశిలో రాహువు సంచారం కొనసాగుతుంది.
రాహువు సంచారం
వచ్చే సంవత్సరం మే 18వరకు మీన రాశి లోనే రాహు సంచారం కొనసాగుతుంది . ఇక బృహస్పతి రాశి అయిన మీనరాశి నుండి మే 18 2025న శని రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభ రాశిలోకి రాహువు సంచారం కొన్ని రాశుల వారికి లాభాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు రాహు సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
రాహువు రాశి సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వ్యాపార ఒప్పందాలు లాభాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. మేష రాశిలో రాహువు ఆదాయం మరియు లాభ స్థానానికి ప్రయాణం చేయడంతో అంతా శుభమే జరుగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహువు రాశి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభరాశి జాతకుల ఆర్దిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృషభ రాశి వారి వృత్తి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. గతంతో పోలిస్తే ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది.
ధనుస్సు రాశి
రాహువు రాశి సంచారం ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. రాహువు వచ్చే సంవత్సరం ధనస్సు రాశి వారి మూడవ ఇంట్లో సంచరిస్తారు. మూడవ ఇల్లు ధైర్యానికి ప్రతీకగా చెబుతారు. కాబట్టి ధనస్సు రాశి వారు ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనస్సు రాశి వారి పని మన్ననలు పొందుతుంది. కష్టమైన పనులను కూడా ధనుస్సు రాశి వారు చాలా సులభంగా చేస్తారు. ఆకస్మిక ఆర్ధిక లాభానికి ధనస్సు రాశి వారికి అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications