2026లో వీరికి రత్న భాండాగారాలు రాసివ్వనున్న రాహువు
వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవగ్రహాలలో రాహువు కేతువులను నీడ గ్రహాలుగా, కీడు చేసే గ్రహాలుగా చెబుతారు. అటువంటి రాహుకేతువులు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇక త్వరలో కొత్త సంవత్సరం 2026 రాబోతుంది .
మకర రాశిలో రాహువు
2026 సంవత్సరం ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తికరంగా ఉంది. ఇక 2026 సంవత్సరంలో రాహువు కుంభరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మర్మ గ్రహమైన రాహువు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇక ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
2026 లో రాహువు సంచారం వృషభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు సాకారం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృషభ రాశి వారి ప్రతి ప్రణాళిక విజయవంతమై కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
మిధునరాశి
2026 లో రాహువు సంచారం మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మిధున రాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి జీవితంలో అంతా మేలు జరుగుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగం ఉంది.
కన్యారాశి
రాహువు సంచారం కన్యారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగంలో పనితీరు గుర్తించబడుతుంది. సంపద కూడబెట్టటానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కన్యా రాశి వారు భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకుంటారు. కుటుంబంలో వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
మీనరాశి
రాహువు సంచారం కారణంగా మీనరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీనరాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా బలంగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications