వరలక్ష్మీ వ్రతం వేళ అరుదైన శుభ యోగాలు.. వీరికి వరలక్ష్మి ఇస్తుంది సిరులు!!

హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణమాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందులో శ్రావణ శుక్రవారానికి ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. శ్రావణ శుక్రవారం రోజు వరాలిచ్చే తల్లి అయిన వరలక్ష్మి దేవిని అందరూ ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు.

ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం.. విశేష యోగాలు
అయితే ఈసారి ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. ప్రీతి యోగం, విష్కుంభయోగం, మహా శని మహాయోగాలు ఏర్పడుతున్నాయి ఇక ఈ శుభయోగాల కలయిక కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rare auspicious yogas at the time of Varalakshmi Vrat Wealth to these zodiac signs

వృషభరాశి
వరలక్ష్మీ వ్రతం వేళ వృషభ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృషభ రాశి వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. వివాహితుల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు.

మిధున రాశి
వరలక్ష్మీ వ్రతం వేళ మిధున రాశి వారు లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో వీరు ఏ పని చేయాలనుకున్న అందులో విశేషమైన ఫలితాలు ఉంటాయి. మిధున రాశి వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సంపద వర్షం కురుస్తుంది. వ్యాపారులు ఒప్పందాలను చేసుకుని భవిష్యత్తులో లబ్ధిని పొందడానికి ఇది సరైన సమయం.

కన్యారాశి
వరలక్ష్మీ వ్రతమైన కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వీరు ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి . అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి.

వృశ్చిక రాశి
వరలక్ష్మీ వ్రతం వేళ వృశ్చిక రాశి వారు కొత్త కారును కొనే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మకర రాశి
మకర రాశి వారికి వరలక్ష్మీ వ్రతం వేళ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వస్తాయి. నూతన ఒప్పందాలను చేసుకుంటారు. పెళ్లిళ్లు కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+