అరుదైన సూపర్ మూన్ : 4 రాశుల వారికి ప్రయోజనం!!
సూపర్ మూన్ లేదా సర్జన్ మూన్ ఆగస్టు ఒకటవ తేదీన ఆకాశంలో రాతి 6:31 నిమిషాల నుండి ఆగస్టు 2న ఉదయం 12:01 నిమిషం వరకు కనిపించింది. వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు కూడా ముఖ్యమైన గ్రహం కావడంతో ఈ సూపర్ మూన్ కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సూపర్ మూన్ వల్ల మేషరాశి జాతకులు మంచి ప్రయోజనాలను పొందుతారు. విలాసవంతమైన సౌకర్యాలను, ఆస్తులను పొందుతారు. వాళ్లు ఏ పని చేసిన లాభం వస్తుంది. వారికి బాగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. సూపర్ మూన్ వల్ల సాధారణఉద్యోగం నుండి సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మారవచ్చు. మీరు ఊహించని డబ్బులు అందుకోవచ్చు. ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఈ కాలంలో ఏదైనా కొత్త అసైన్మెంట్లు లేదా ప్రాజెక్ట్ లు ప్రారంభించడం శుభప్రదం.

సూపర్ మూన్ వల్ల వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది, వీరి జీవితంలో ఇతర అంశాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో సంబంధం సానుకూలంగా ఉంటుంది. మీరు మంచి కమ్యూనికేషన్ శక్తిని కలిగి ఉంటారు. మీరు ఎందులో చెయ్యి పెట్టినా కలిసొస్తుంది. సూపర్ మూన్ వల్ల వృషభ రాశి వారికి అన్ని విధాల లబ్ది జరుగుతుంది.
సూపర్ మూన్ వల్ల కర్కాటక రాశి వారికి లాభం జరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వ్యక్తులపై ఇది మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. సూపర్ మూన్ వల్ల వారు వినోదాలు, వేడుకలు, ఉత్సవాలలో పాల్గొనవచ్చు. సూపర్ మూన్ వల్ల మీరు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటారు. ప్రజల మనసులపై మనోహరమైన ముద్ర వేస్తారు. ఆర్థికంగా బాగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం.
సూపర్ మూన్ వల్ల వృశ్చిక రాశి వారికి లాభిస్తుంది. వృశ్చిక రాశి జాతకులు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది సరైన సమయం. సూపర్ మూన్ వల్ల మీరు మీ లక్ష్యాలను సాధించడంలో చొరవ తీసుకోవాలి. సూపర్ మూన్ మీ నాయకత్వ లక్షణాలను మెరుగుపరుస్తుంది. రేసులో మిమ్మల్ని ముందంజలో ఉంచుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications