rasi phalalu today: నేడు వీరికి కార్యసిద్ధి; ఊహించినదాని కంటే గొప్ప ఫలితాలు!!

గ్రహాల గమనం మన జాతక చక్రాన్ని నిర్దేశిస్తుంది. గ్రహాల గమనం కారణంగా ప్రతిరోజు రాశుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి. ఇక నేడు తులారాశి నుండి మీన రాశి వరకు ఆరు రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంది. ఎవరికి కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

తులారాశి
తులా రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈరోజు వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే మనసుపెట్టి పని చేస్తే మాత్రం అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. నేడు తులా రాశి వారికి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఇక ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. నేడు తులారాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం మంచిదని సలహా.

rasi phalalu today Better results than expected to these zodiac signs

వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి సర్వత్ర విజయ సిద్ధి కలుగుతుంది. ఊహించిన దాని కన్నా వృశ్చిక రాశి వారి గొప్ప ఫలితాలు పొందుతారు. మీ పనితీరు ప్రశంసలను అందుకుంటుంది. వృశ్చిక రాశి వారికి ఒక వార్త శక్తినిస్తుంది. ఆత్మీయులతో వృశ్చిక రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన చేస్తే మంచిది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు చాలా మంచి రోజు. ఈరోజు ధనుస్సు రాశి జాతకులు ఏ పనులు చేసిన విజయం సాధిస్తారు. ఇష్టమైన వారిని కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. నేడు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఇష్టదేవత స్తోత్రం పారాయణం చేయడం వల్ల మరింత సానుకూలమైన ఫలితాలు వస్తాయి.

మకర రాశి
మకర రాశి జాతకులకు నేడు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. వీరికి ఆర్థికపరమైన జాగ్రత్తలు నేడు అవసరం. ఆపదలు, కష్టాలు ఎదురవుతాయి. మకర రాశి వారికి నేడు ఒక అశుభవార్త విచారం కలిగిస్తుంది. నేడు కలహాలకు ఆస్కారం ఉంది. మకర రాశి జాతకులు నేడు ఆవేశాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. నేడు శ్రమ అధికంగా ఉంటుంది. లింగాష్టకం చదవడం వల్ల పనులలో విజయం సాధిస్తారు.

కుంభరాశి
కుంభ రాశి జాతకులకు నేడు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. మొహమాటంగా ప్రవర్తించడం నేడు ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవడం లాభదాయకం. నవగ్రహ ధ్యానం వల్ల నేడు వీరికి మేలు జరుగుతుంది.

మీన రాశి
మీన రాశి జాతకులకు నేడు ఒక శుభవార్త ఆనందాన్ని తీసుకువస్తుంది. నేడు వీరికి కార్యసిద్ధి ఉంటుంది. మానసికంగా ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+