rasi phalalu today: నేడు వీరికి ఆర్ధిక శ్రేయస్సు; కానీ ఆరోగ్యం జాగ్రత్త!!

మారుతున్న గ్రహాల కారణంగా, వివిధ రాశుల్లో గ్రహ సంచారం కారణంగా ప్రతిరోజు ద్వాదశ రాజుల వారి జీవితంలో మార్పులు ఉంటాయి. కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే, కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటాయి. ప్రస్తుతం మనం తులారాశి నుండి మీనరాశి వరకు నేడు ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి? అనేది తెలుసుకుందాం.

తులారాశి
తులా రాశి జాతకులకు ఆర్థికంగా మిశ్రమ కాలంగా చెప్పబడింది. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తులారాశి జాతకులు ఆరోగ్యం పైన ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వీరి మనోబలం పెరగడం కోసం విష్ణు ధ్యానం శుభప్రదంగా చెప్పబడింది.

rasi phalalu today financial prosperity for these zodiac signs today But take care of about health

వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేడు వీరికి ఏమాత్రం అనుకూలంగా లేదు. చేపట్టే పనులలో బద్దకాన్ని వదిలిపెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేడు చేసే పనులలో విఘ్నాలు ఎదురవుతాయి. చంచలమైన బుద్ధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. శ్రీహరిని పూజిస్తే వీరికి నేడు మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు మీ మీ రంగాలలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం చదవడం మంచిది.

మకర రాశి
మకర రాశి జాతకులకు సంతోష దాయకంగా ఉంటుంది. నేడు వీరికి మానసిక సౌఖ్యం కలుగుతుంది. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిదని చెప్పబడింది. మీరు గోసేవ చేసుకుంటే మంచిది.

కుంభరాశి
కుంభ రాశి జాతకులు నేడు ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, కనుక జాగ్రత్త అవసరం. వైరాగ్యాన్ని దరిచేరనీయకుండా ఉండాలి. శివ నామాన్ని జపించడం ఉత్తమంగా చెప్పబడింది.

మీనరాశి
మీన రాశి జాతకులు నేడు ఏ పని చేసిన వారి కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకుండా ఉంటే మంచిది. లలితా దేవిని స్తుతి చేయడం మంచిదని చెప్పబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+