rasi phalalu today: మూడు శుభాయోగాలతో ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం!!

వేద జ్యోతిషశాస్త్రంలో ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాదు ఈరోజు ద్వాదశ రాశులపైన పుష్య నక్షత్రం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. నేడు అమలకి ఏకాదశి కూడా.. ఈరోజు గజకేసరి యోగం, రవి యోగం, కేంద్ర యోగం ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఈరోజు కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలిగితే మరికొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నేటి మేషరాశి జాతకులు ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకూడదు. కీలకమైన వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగాలి. నవగ్రహ ప్రార్ధన చేస్తే నేడు మంచిది.

rasi phalalu today Lakshmi blessings for these zodiac signs with three auspicious yogas

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈరోజు మంచి అనుకూలమైన సమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి నేడు వృషభ రాశి జాతకులు అందరి మన్ననలు పొందుతారు. సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఈరోజు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. నేడు వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వృషభ రాశిజాతకులు నేడు గణపతి ఆరాధన చేస్తే మంచిది.

మిధున రాశి
మిధున రాశి వారు ఈ రోజు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మిధున రాశి జాతకులు ఈరోజు ఎదుటివారి వ్యవహారాల్లో తలదూర్చడం ఉంటే మంచిది. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. నేడు శని ధ్యానం చేయడం శుభప్రదంగా చెప్పబడింది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది . పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారి కొత్త పనులను ప్రారంభిస్తారు. నేడు ఆర్ధికంగా బాగానే ఉంటుంది. ఏదైనా సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు గా ఉండాలి. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలతో వీరు అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. తోటి వారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. నేడు వీరికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. శ్రీ విష్ణు నామాన్ని పారాయణం చేయడం మంచిది.

కన్యారాశి
కన్యారాశి జాతకులకు నేడు అనుకూలంగా ఉంటుంది. మీరు పని చేసే రంగాలలో శుభవార్తను వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. లక్ష్మీ దేవి దయ వీరిపై ఉంటుంది. నేడు శివ నామ స్మరణ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+