rasi phalalu today: నేడు ఈ ఒక్కరాశి వారికే తిప్పలు.. మిగతా రాశులకు ఆనందాలు!!

మార్చి 14వ తేదీన నేడు కొన్ని రాశుల వారు శుభవార్తలు వింటే మరికొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశుల వారి జాతకం నేడు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తులారాశి
తులా రాశి వారు నేడు చాలా సంతోషకరమైన వార్తలు వింటారు. ఆత్మీయుల ప్రేమాభిమానాలను పొందుతారు. నేడు తులా రాశి వారికి ధన లాభం కలుగుతుంది. పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. అయితే ఎటువంటి వివాదాలలో తల దూర్చకుండా ఉండాలని సూచించబడింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం చేయడం నేడు శ్రేయోదాయకంగా చెప్పబడింది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నేడు వృశ్చిక రాశి జాతకులు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నేడు వీరికి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవడం వీరికి ఈరోజు మేలు చేస్తుంది.

rasi phalalu today only one zodiac sign faces troubles left all zodiac signs are happy

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేడు సానుకూలంగానే ఫలితాలు ఉన్నాయి. వివిధ రంగాలలో పనిచేసే ధనుస్సు రాశి జాతకులకు పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. విజయం సిద్ధిస్తుంది. స్నేహితుల బలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు కూడా ఈ సమయంలో మంచి జరుగుతుంది. అయితే దైవారాధన మానకుండా ఉండాలి.

మకర రాశి
మకర రాశి జాతకులకు నేడు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని విజయం సాధిస్తారు. మీ మనో ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధి చాంచల్యం తో ప్రవర్తిస్తారు. నేడు విష్ణు నామ స్మరణం చేయడం శుభంగా సూచించబడింది.

కుంభరాశి
నేడు కుంభ రాశి జాతకులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. కుంభ రాశి జాతకులకు శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కుంభరాశి జాతకులు ఆదిత్య హృదయం చదివితే మంచిది .

మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈరోజు శ్రమతో కూడిన ఫలితాలు దక్కుతాయి. గతంలో నిర్లక్ష్యంగా వదిలేసిన కొన్ని అంశాలు నేడు ఇబ్బంది పెడతాయి. ఇక కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. అయితే మీనరాశి జాతకులు నేడు గో సేవ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+