rasi phalalu today: డబ్బుతో సహా కీలక నిర్ణయాలలో ఈ రాశులవారు జాగ్రత్త!!
నేడు వివిధ రాశుల వారి జాతకాలు ఎలా ఉన్నాయి. ఎవరు ఈ రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు? ఎవరు చేయకూడదు? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి? వంటి అనేక వివరాలను తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం తులా రాశి నుంచి మీన రాశి వరకు వివిధ రాశుల వారి నేటి రాశి ఫలాలు తెలుసుకుందాం.
తులారాశి
తులా రాశి జాతకులకు నేడు మంచి కాలం. అయితే ఈ సమయాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగించాలి. తులారాశి జాతకులు ఈ సమయంలో గొప్ప ఫలితాలను పొందుతారు. నేడు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మీకున్న టాలెంట్ తో అసాధ్యాలను సుసాధ్యం చేయగలుగుతారు. నేడు ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. తులా రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి సందర్శన చేయడం మంచిది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించి అనుకున్న మంచి ఫలితాలను సాధిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం మంచిదని సలహా. అనవసరమైన విషయాల వైపు మనసు మళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకుల మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతో బాగా పనిచేస్తాయి. నేడు కాస్త సర్దుకుపోయే మీ మనస్తత్వం మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. నేడు దుర్గాదేవిని ధ్యానం చేయడం మీకు శ్రేయస్సును కలిగిస్తుంది.
మకర రాశి
మకర రాశి జాతకులు నేడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు కలహాల సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు నవగ్రహ ధ్యానం చేయడం శుభప్రదంగా చెప్పబడింది.
కుంభరాశి
కుంభ రాశి వారికి నేడు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసరపు ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో ధైర్యంగా ప్రవర్తిస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిదని సలహా. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలని చెబుతున్నారు. శ్రీ విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదంగా చెప్పబడింది.
మీనరాశి
మీన రాశి జాతకులు మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. బంధువులతో తమ సంతోషాన్ని నేడు పంచుకుంటారు. చిత్తశుద్ధితో పనులు చేయడం వల్ల మీరు విజయాన్ని సాధించ గలుగుతారు. నేడు వీరికి ఆంజనేయ స్వామిని ఆరాధించడం శుభప్రదంగా చెప్పబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications