rasi phalalu today: గజకేసరియోగంతో సహా మూడు శుభయోగాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే!!
వేద జ్యోతిషశాస్త్రంలో ఈరోజుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది నేడు అమలకి ఏకాదశి. అంతేకాదు ఈరోజు గజకేసరి యోగం, రవి యోగం, కేంద్ర యోగం ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఈరోజు కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలిగితే మరికొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి నుండి మీన రాశి వరకు ఈరోజు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
తులారాశి
తులా రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. తులా రాశి వారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు. వీరికి మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. తులారాశి వారికి బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు. చంద్రశేఖర అష్టకం చదవడం శుభప్రదం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు ఈరోజు బంధుమిత్రులతో సంబంధాలు కొనసాగిస్తారు. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. ప్రారంభించిన కార్యక్రమాలను మనో సంకల్పంతో పూర్తి చేస్తారు. ఈరోజు జరిగే కీలకమైన చర్చలు కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. ఇష్ట దైవారాధన చేయడం మంచిదని చెప్పబడింది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేడు శుభప్రదంగా ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులు చేసే ప్రయత్నాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. వినాయకుడి ఆరాధన చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది.మకర రాశి వ్యక్తులు ధర్మచింతన తో నేడు వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయ భాగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. దైవ బలం సంపూర్ణంగా రక్షణను ఇస్తుంది. అయితే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. సూర్యభగవానుడి ఆరాధన మేలు చేస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి నేడు శుభప్రదంగా ఉంటుంది. నేడు చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేడు మనోధైర్యంతో చేసే పనులు వీరికి లాభదాయకంగా ఉంటాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచి జరుగుతుంది.
మీన రాశి
నేడు మీనరాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. పనులలో ఆపదలు పెరగకుండా నేడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనసును స్థిరంగా ఉంచుకోవడం, అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చేయాలి. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications