rasi phalalu today: నేడు ఈ రాశులవారికి ధనలాభం.. వీరికి డబ్బు ఖర్చు!!

నేడు వివిధ రాశుల్లోకి గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి మేలును, కొన్ని రాశుల వారికి కీడును చేస్తోంది. తులారాశి నుండి మీన రాశి వరకు నేడు వివిధ రాశుల వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది. నేడు ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తులారాశి
నేడు తులా రాశి వారు ఏ పని చేపట్టినా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు బాగుంటుంది. మీ అభివృద్ధికి దోహదపడే విధంగా అధికారులు మీ విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. నేడు విందులు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది.

rasi phalalu today Today these zodiac signs will gain money They will spend money

వృశ్చిక రాశి
మనోబలంతో చేసే పనుల వల్ల ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. చేపట్టే పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఒక కీలక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు. తోటివారితో కలిసిపోయి ముందుకు వెళ్లాలి. చంద్ర ధ్యానం శుభప్రదంగా సూచించబడింది.

ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారికి కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి. భగవంతుడి దయ నేడు ధనుస్సు రాశి వారిపై ఉంటుంది. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ధనుస్సు రాశి జాతకులు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. చంచలమైన బుద్ధి కారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . నేడు గురు ఆరాధన చేయడం మంచిది.

మకర రాశి
మకర రాశి వారు ఈరోజు ఏ పని అనుకున్న సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో నేడు ఆనందంగా గడుపుతారు. ఇష్టమైన వారికి సమయాన్ని కేటాయిస్తారు. గొప్ప వారి పరిచయ భాగ్యం కలుగుతుంది. ఇష్ట దైవ ప్రార్థన చేయడం మేలుగా సూచించబడింది.

కుంభరాశి
కుంభ రాశి వారికి నేడు మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కుంభ రాశి వారికి ధన వ్యయం సూచనలు ఉన్నాయి. వీరికి కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదని చెప్పబడింది. కుంభరాశి జాతకులు నేడు సూర్య నమస్కారం చేస్తే ఆత్మ శక్తి పెరుగుతుంది.

మీన రాశి
మీన రాశి జాతకులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. నేడు మీన రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రణాళికబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. కొన్ని విషయాలలో అస్థిరమైన మనస్తత్వంతో ప్రవర్తిస్తారు. నేడు నవగ్రహ ధ్యానం చేయడం వీరికి శుభప్రదంగా సూచించబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+