పెళ్ళిళ్ళు కావట్లేదా? దాంపత్య జీవితంలో చిరాకులా? కుజదోషం కావచ్చు, పరిహారాలివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కుజుడు రాశులలో మొదటి, ఎనిమిదవ గృహాలను పరిపాలిస్తాడు. జాతకంలో కుజదోషం ఉంటే అటువంటివారు వివాహానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కుజ దోషం ఉన్నవారికి ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా వివాహ యోగం కలగదు. ఇక పెళ్లయిన వారు కూడా కుజదోషం ఉంటే వైవాహిక బంధంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కుజదోష నివారణకు పరిహారాలు
కుజదోషం ఉన్నవారు నుండి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. కుజ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 70 సార్లు జపించడం,షష్టి నాడు సుబ్రహ్మణ్య అష్టకం ఏడు సార్లు పారాయణం చేయడం, ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉండడం వంటివి కుజదోషాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు కందులు దానం ఇవ్వడం శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించడం కూడా పరిహారాలలో చెప్పబడింది.

మంగళవారం ఇలా చేస్తే కుజ దోష నివారణ
ఆదివారం రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య మాలా మంత్రం 42 రోజులపాటు రోజుకొకసారి పారాయణం చేయడం కూడా కుజ దోష నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేసినా కుజదోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. మంగళవారం రోజు ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజించి, హనుమంతుని ఆశీస్సులతో మంగళ దోషాన్ని శాంతింప చేయవచ్చు. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో గొప్ప ప్రయోజనాలు పొందుతారు.
హనుమంతుడికి ఇలా చేస్తే కుజదోషం పోతుంది
హనుమంతుడికి పూజలో ఎర్రని పూలను, బెల్లం పప్పును సమర్పించి పూజించినా కుజ దోషం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. మంగళవారం రోజు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. కుజదోషం నుంచి నివారణ కలుగుతుంది. కుజదోషం బారిన పడిన వ్యక్తికి రావి చెట్టుతో వివాహం జరిపించిన కూడా కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ దానాలతో కుజ దోషం నుండి విముక్తి
కుజదోషం ను ఎదుర్కోవడానికి మంగళవారంనాడు కుజుడికి ఇష్టమైన వివిధ వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. మంగళవారం నాడు రాగి, బెల్లం, పప్పులు , ఎర్రని బట్టలు, ఎర్రని వస్తువులు దానం చేస్తే కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది. మంగళవారం నాడు ఉపవాసం ఉన్నా కూడా కుజదోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. కుజ దోష నివారణకు హనుమాన్ ఆలయంలో, నవగ్రహాల ఆలయంలో, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో శాంతి పూజ చేస్తే కూడా కుజ దోషం నివారణ అవుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications