ఇంట్లో వాస్తు దోషాలు పోవడానికి స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పిన పరిహారాలు
సాక్షాత్తూ పరమాత్మే శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి మహాభారతంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఎన్ని యుగాలు మారినా దాన్ని అందరూ అనుసరిస్తున్నారు. మన జీవితంలోని ప్రతి సమస్యకు అందులో పరిష్కారం లభిస్తుంది. అందుకే ఆయన జగద్గురువు అయ్యారు. అలాగే సర్వాంతర్యామి అయిన కృష్ణభగవానుడు మహా భారత యుద్ధంలో ధర్మరాజుకు కుటుంబ సంతోషం కోసం, రాజ్యం ప్రశాంతంగా ఉండేందుకు కొన్ని నియమాలను చెప్పారు. వాటిని పాటిస్తే అందరి జీవితంలో సుఖశాంతులు, ప్రశాంతత, ఆనందం లభిస్తాయి. శ్రీకృష్ణుడు చెప్పిన వాస్తు నియమాలను తెలుసుకొని మనం కూడా అనుసరించి సంతోషంగా ఉందాం.
ధూపం
ఇంట్లో కచ్చితంగా ధూపం వేయమని చెప్పాడు. దీనివల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం పోతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ప్రతిరోజూ కచ్చితంగా ధూపం వేయడంవల్ల ఎలాంటి వాస్తు దోషమైనా పారిపోతుంది.

పరిమళం
గంధం వాసన ఎప్పటికీ తగ్గదు. అందుకే ఒక చందనం ముక్కను ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి. ఏ పదార్థమైనా వాసన తగ్గుతుందికానీ గంధం వాసన తగ్గదు. గంధతో లక్షల పూలు దేవుడికి అలంకరించినా గంధం వాసనే వస్తుంది.
నెయ్యి
కుటుంబంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎప్పుడూ ఉండాలి. దీన్ని పూజతోపాటు ఆహారంలో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కుటుంబంలో నెయ్యి అయిపోకుండా చూసుకోవాలి. ఏ నెయ్యి పడితే ఆ నెయ్యిని వాడకూడదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడాలి.
తేనె
తేనె మన ఆత్మను, కుటుంబ పరిసరాలను, ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. పూజలో అందుకే నెయ్యితోపాటు తేనెను కూడా ఉపయోగిస్తారు. ఇంట్లో వాస్తు దోషాన్ని పోగొట్టే శక్తి తేనెకు కూడా ఉందని శ్రీకృష్ణుడు ధర్మారాజుకు చెప్పాడు.
దీపం
ప్రతిరోజు ఇంట్లో ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపం వెలిగించాలి. ఇలా స్తే వాస్తు దోషం పోతుంది. చీకటిని పారద్రోలి వెలుగును నింపే దీపంవల్ల ఇంట్లో వాస్తు దోషం కూడా పోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
నీరు
ఇంటికైనా, రాజ్యానికైనా నీటి కొరత ఉండకూడదు. మనం ఉండేచోట నీరు అందుబాటులో ఉండాలి. ఇంటికి అవసరమైన నీరు ఈశాన్య దిశ నుంచి రావాలి. ప్రతిరోజు దాన్ని ఈశాన్య దిశ నుంచే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈశాన్యం అనేది భగవంతుడి దిక్కు. భగవంతుడి దిశ.
సరస్వతీ పూజ
చదువుల తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అయిన సరస్వతి మాతను పూజించడంవల్ల మనకు మంచి బుద్ధులు అబ్బి జ్ఞానాన్ని తెలుసుకుందాం. అందుకే ఇంట్లో సరస్వతి దేవి ఫొటోను లేదంటే పాదరసం విగ్రహాన్ని ఉంచుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు.












Click it and Unblock the Notifications