సంసప్తక్ యోగం ఆగస్ట్ లో వీరికి సిరి సంపదలను మోసుకొస్తుంది!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇదే సమయంలో శని కుంభరాశిలో సూర్యుడి నుండి 180 డిగ్రీల వద్ద ఉంటాడు. దీనివల్ల సూర్యుడు, శని కలయికతో సంసప్తక యోగం ఏర్పడుతుంది.

సూర్యుడు, శనితో సంసప్తక యోగం
ఆగస్టు 16వ తేదీన ఏడవ ఇంట్లో సూర్యుడు, శని గ్రహాలు రెండు ఒకదానికొకటి 180 డిగ్రీల వద్ద ఉండటం వల్ల సంసప్తక యోగం సంభవిస్తుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. సంపదల వర్షం కురుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Samsaptak Yoga brings wealth to these zodiac signs in August

సింహరాశి
సూర్యుడు శని సంయోగం వల్ల ఏర్పడే సంసప్తక యోగంతో సింహ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. సింహరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంబంధిత సమస్యల నుండి సింహరాశి జాతకులు ఉపశమనం పొందుతారు. వర్తక వ్యాపారాలలో కలిసి వస్తుంది. ప్రతి పని సానుకూల ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది.

కుంభరాశి
సూర్యుడు శని కలయిక వల్ల ఏర్పడే సంసప్తక యోగం వల్ల కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. సంపదల వర్షం కురుస్తుంది. కెరీర్ లో గొప్ప విజయాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులలోనూ, ఆస్తులు పంచాయితీలలోను విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

తులారాశి
తులా రాశి వారికి సూర్యుడు మరియు శని కలయిక వల్ల ఏర్పడే సంసప్తక యోగం గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కెరీర్ పురోగమిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+