సంక్రాంతి నేడే.. ఈ దానాలతో మీ ఇంటికి ధనపు రాశులు!
సంక్రాంతి పండుగ నేడు. సంక్రాంతి పండుగ రైతుల పంటలన్నీ ఇంటికి చేరిన వేళ జరుపుకునే పండుగ. పాడిపంటలు బాగుండాలని కోరుకునే పండుగ. తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. ఈ సంక్రాంతి పర్వదినం సూర్యభగవానుడి ఆరాధన, రైతన్నల గౌరవం, పశువుల పూజలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రంగురంగుల ముగ్గులతో కళకళలాడే ఇంటి ముంగిళ్ళు, హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, బొమ్మల కొలువులు తెలుగువారి సంస్కృతి, జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి.
సంక్రాంతి నాడు దానాలు చేస్తే శుభ ఫలితాలు
మకర సంక్రాంతి పర్వదినం నాడు మనం కొన్ని దానాలు చేసినట్లయితే వారికి జీవితంలో ధనపురాశులు వస్తాయని ప్రతీతి.మన హిందూ ధర్మ శాస్త్రంలో దానధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున దానం చేయడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

సంక్రాంతి నాడు చెయ్యవలసిన దానాలు
సంక్రాంతి పండుగ నాడు చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలాలు వస్తాయి. సంక్రాంతి పండుగ నాడు గోదానం చేయడం మంచిది. గోవులను దానం చేయడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి పుణ్య ఫలాలు వస్తాయి. సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా భూదానం చేసిన విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇక సువర్ణ దానం,వెండి దానం, అన్నదానం, పుస్తకదానం ఇలా దానాలు శ్రేయస్సును కలిగిస్తాయి.
ఈ దానాలతో ఆరోగ్యం
సంక్రాంతి పండుగ నాడు నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. నువ్వులు సూర్యభగవానుడికి, శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి. కాబట్టి నువ్వులను లేదా నువ్వులతో చేసిన ఉండలను జాతక దోషాలు తొలగిపోయి, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక సంక్రాంతి పండుగకు పేదలకు దుప్పట్లు, ఉన్ని వస్త్రాలు దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
ఇవి దానం చేస్తే అన్నానికి లోటు ఉండదు
ధాన్యం సమృద్ధిగా ఉండాలి అని భావించేవారు సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యాన్ని, బెల్లాన్ని దానం చేస్తే ఇంట్లో ఆహారానికి లోటు ఉండదు. పండగ రోజు గుమ్మడికాయను దానం చేయడం అన్నిటికంటే శ్రేష్ఠమైనది. దీనిని దక్షిణతో కలిపి దానం ఇవ్వడం వల్ల సర్వ శుభాలు చేకూరుతాయి. ఇక పసుపు, కుంకుమ, గాజులు వంటి సౌభాగ్య ద్రవ్యాలను ముత్తైదువులకు వాయినంగా ఇవ్వడం కూడా శుభాలను చేకూరుస్తుంది.
ధన సమృద్ధికి సంక్రాంతి దానం బెస్ట్
సంక్రాంతి పండుగకు పాదరక్షలు లేనివారికి చెప్పులు, ఆకలితో ఉన్నవారికి భోజనం, వంటకు కావలసిన పదార్థాలు ఇవ్వడం చాలా మంచిది. సంక్రాంతి పండుగకు చేసే ప్రతి చిన్న దానం జీవితంలో సుఖసంతోషాలను, ధన సమృద్ధిని కలుగజేస్తుందని చెబుతారు.












Click it and Unblock the Notifications