జులైలో వీరికి తిరుగులేని సంపదలను, సంతోషాలను ఇవ్వనున్న శని, గురులు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. జూలై మాసంలో బృహస్పతి మరియు శని వంటి ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్న కారణంగా ద్వాదశ రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి.
శని, గురు గ్రహాల కదలికల కారణంగా లబ్ధిని పొందే రాశులు
న్యాయ దేవుడు, కర్మ దేవుడు అయిన శని తన స్థానాన్ని మార్చుకుంటున్నారు. మరోవైపు దేవగురువు బృహస్పతి కూడా జూలై నెలలో ఉదయిస్తున్నాడు. ఈ రెండు పెద్ద గ్రహాల కదలికల కారణంగా వివిధ రాశుల వారు శుభ ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తుంది. మరి జూలై మాసంలో శని, గురు గ్రహాల కారణంగా లబ్ధిని పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి అదృష్టం
జూలై 13వ తేదీ నుంచి శని తిరోగమన స్థితిలోకి వెళుతున్నాడు. జూలై 13వ తేదీ తిరోగమన స్థితికి వెళుతున్న శని నవంబర్ 28 వరకు అదే స్థితిలో ఉంటాడు. ఇక బృహస్పతి జులై 9న మిధున రాశిలో ఉదయిస్తుంది. వీరిద్దరి సంచారం ముఖ్యంగా వృషభ రాశి , మిధునరాశి, తుల రాశి, ధనుస్సు రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభాలను కలిగిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలకు కారణమవుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు జూలై మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రధాన గ్రహాలైన గురువు, శని మార్పుల కారణంగా వృషభ రాశి వారు అనేక ఒప్పందాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. కార్యాలయంలో పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మిధున రాశి
మిధున రాశి వారికి కూడా జూలై మాసంలో శని మరియు బృహస్పతి కారణంగా కలిసి వస్తుంది. మిధున రాశి జాతకులకు రెండు ముఖ్య గ్రహాలు మంచి శుభాలను చేకూరుస్తాయి. వీరికి వ్యాపారాలలో కలిసి వస్తాయి. ఆర్థికంగా ప్రగతి కనిపిస్తుంది. వివిధ ఒప్పందాల నుంచి మిధున రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి.
తులారాశి
బృహస్పతి, శని జూలై మాసంలో మార్పు కారణంగా తులారాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు. తులా రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. తులారాశి జాతకులు కష్టపడి పనిచేయడం ద్వారా పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు.
ధనస్సు రాశి
బృహస్పతి, శని జూలై మాసంలో జరుగుతున్న మార్పు కారణంగా ధనస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వీరి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి జాతకులు వివిధ ఒప్పందాల నుంచి ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు పొందవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు గురు గ్రహం యొక్క ఆశీర్వాదాలను పొందుతారు. కొత్త ప్రాజెక్టులలో పనిచేస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications