రాసి పెట్టుకోండి.. ఫిబ్రవరిలో బుధ, శని గ్రహాల యుతితో వీరి పంట పండుతుంది!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలలో ఏ గ్రహానికి ఆ గ్రహమే ప్రత్యేకం. గ్రహాల రాజు అయిన బుధుడు నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. అలాగే శని కూడా నిర్దిష్ట సమయం తర్వాత రాశి చక్రాన్ని మారతాడు. బుధుడు ఏకాగ్రతను, మేధా సామర్ధ్యాన్ని, విద్యా వ్యాపారాలకు కారణంగా చెప్పబడే గ్రహం, అటువంటి బుధుడు రాశి చక్ర మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

బుధ, శని గ్రహాల యుతి
గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఫిబ్రవరి 11వ తేదీ 2025 సంవత్సరంలో మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకు కుంభరాశిలో ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం శని తన సొంత రాశిలో సంచరిస్తున్న కారణంగా అక్కడ బుధ శని గ్రహాల మధ్య యుతి జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలయిక కొన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా బుధ శని గ్రహాల యుతితో ప్రయోజనాలు పొందే ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

Saturn and Mercury conjunction huge wealth for these zodiac signs in 2025

మిధున రాశి
బుధ మరియు శని కలయిక కారణంగా మిధునరాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశికి తొమ్మిదవ ఇంట్లో అంటే అదృష్టగృహంలో బుధ, శని గ్రహాల సంయోగం జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారికి సుఖాలు, విలాసాలు చేకూరుతాయి. కెరీర్ కూడా చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. ఏదైనా పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడతారు.

తులారాశి
బుధుడు మరియు శని కలయిక కారణంగా తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి యొక్క ఐదవ ఇంట్లో బుధ మరియు శని గ్రహాల సంయోగం ఉండబోతుంది. కాబట్టి ఈ రాశికి చెందినవారు ఏ పని చేసినా ఇప్పుడు విజయం సాధిస్తారు. వర్తక వాణిజ్యాలు చేసే వారికి కలిసొస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది.

సింహరాశి
సింహరాశిలో బుధుడు శని కలయిక ఏడవ ఇంట్లో జరుగుతుంది. ఇది సింహరాశి యొక్క వ్యక్తుల జీవితాలలో అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. కెరీర్ ఈ సమయంలో బాగుంటుంది. జీవితంలో సానుకూల ప్రభావాలను చూస్తారు. మీ పని ప్రశంసించబడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. ఇది సింహ రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+