వీరికి కష్టాలను, ఆర్ధిక నష్టాలను తెచ్చిన శని సూర్యులు.. జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావం చూపిస్తాయనే విషయం మనకు తెలిసిందే. సెప్టెంబర్ మాసంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు, కర్మ దేవుడైన శని గ్రహం ఒకరికొకరు ముఖాముఖిగా వచ్చారు. సెప్టెంబర్ 8వ తేదీన ఈ రెండు గ్రహాలు 180 డిగ్రీల వద్ద ఏజే ఎదురుగా వచ్చాయి.
శని సూర్యుల ముఖాముఖి.. దురదృష్ట రాశులు
సూర్యుడు శని ముఖాముఖిగా రావడం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే మరికొన్ని రాశుల వారు దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శని సూర్యులు ముఖాముఖిగా రావడం వల్ల కష్టాలను ఎదుర్కొనే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
శని సూర్యులు ఎదురెదురుగా రావడం వలన వృషభ రాశి వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కష్టాలనే ఎదుర్కోవలసి వస్తుంది. ప్రజలతో సంబంధాలలో అనేక చిరాకులు ఏర్పడతాయి. ఊహించని విధంగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక వృషభరాశి జాతకులు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటక రాశి
శని సూర్యుల ముఖాముఖి వల్ల కర్కాటక రాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కర్కాటక రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాలి.
మకర రాశి
శని సూర్యులు ఒకదానికి ఒకటి ఎదురుగా రావడం వలన మకర రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. మకర రాశి వారి పైన శని చెడు ప్రభావాలను చూపించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఈ సమయం మకర రాశి వారికి చాలా అసౌకర్యంగా అనిపించే సమయం. కనుక మకర రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీనరాశి
శని సూర్యులు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా రావడం వలన మీన రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వీరు ప్రతికూల ఫలితాలను చూస్తారు. మీన రాశి వారికి మానసిక క్షోభ కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీన రాశి జాతకులు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications