కుంభరాశిలో సూర్య శని సంయోగం: ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య , శని గ్రహాలు ప్రధానమైన గ్రహాలుగా చెబుతారు. సూర్యుడికి, శని గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి శనిగ్రహం మారుతూ ఉంటుంది. ఇక సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మార్చి 14వతేదీ వరకు సూర్యుడు మకర రాశి లోనే ఉంటాడు.

ఇక ఇదే సమయంలో సూర్యుడు మరియు శని కుంభరాశిలో కలుసుకోబోతున్నారు. సూర్య శని సంయోగం కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శని సంయోగం వల్ల సింహ రాశి వారికి శుభాలు జరుగుతాయి. సింహరాశి జాతకుల వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి. కుంభరాశిలో శని సూర్య సంయోగం వల్ల సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.

saturn and sun conjunction in aquarius: wealth and luck for these 3 zodiac signs!!

ఈ సమయం వ్యాపార సంబంధిత పెట్టుబడులు పెట్టటానికి సరైన సమయం. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. పెట్టుబడుల ద్వారా ఆదాయం ఆర్జించటానికి ఇదే సరైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు కూడా లాభాలకు చాన్స్ ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి.

కుంభరాశిలో సూర్య శని సంయోగం వల్ల కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ సమయంలో కుంభరాశి జాతకులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్య మరియు మేధోపరమైన పనుల్లో అపార విజయాన్ని సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో ఆర్థిక లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభ రాశిలో శని సూర్య సంయోగం వల్ల ధనుస్సు రాశి వారికి లబ్ధి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో వీరికి లాభాలు వస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసొస్తుంది. కొత్త ప్రాజెక్టులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+