2026లో శనిదేవుడి ఆశీస్సులతో వీరికి ఏడాదంతా పండుగే!
నవగ్రహాలలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శని దేవుడు క్రమశిక్షణ నేర్పే దేవుడు. కర్మలకు అధిపతి. అటువంటి శని దేవుడు జాతకంలో ఉన్నత స్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నీచ స్థానంలో ఉంటే ప్రతికూల ఫలితాలను చూస్తారు. 2026 సంవత్సరంలో శని దేవుడు మీన రాశిలో సంచారం చేస్తాడు.
2026లో శనిదేవుడి శుభ దృష్టి
సంవత్సరం పొడవున కొంతకాలం ప్రత్యక్షంగాను, మరికొంతకాలం తిరోగమనం లోను సంచారం చేస్తాడు. అనేక నక్షత్రాలను మారుతూ శని దేవుడి సంచారం కొనసాగుతుంది. బృహస్పతి రాశి అయిన మీనరాశిలో శనిదేవుని సంచారం కారణంగా 2026 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శని యొక్క శుభదృష్టి ఆ రాశుల పైన ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
2026 సంవత్సరంలో శనిదేవుడు ఆశీస్సులతో వృషభరాశి వారికి బాగుంటుంది. ఈ రాశిలో పదకొండవ ఇంట్లో శనిదేవుడు ఉంటాడు. ఈ ఇల్లు కోరికలు నెరవేర్చే ఇల్లుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయంలో వృషభరాశి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కర్మ గ్రహానికి అధిపతి అయిన శనిదేవుడు 11వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక వస్తుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆర్థిక స్థిరత్వం కనిపిస్తుంది.
తులారాశి
2026 సంవత్సరంలో శనిదేవుడు ఆశీస్సులు తులారాశి వారిపైన పుష్కలంగా ఉంటాయి. 6వ ఇంట్లోకి శనిదేవుడు ప్రవేశిస్తాడు. ఈ రాశిలో జన్మించిన వారికి శనిదేవుడు విజయాలను ఇస్తాడు. ఈ సమయంలో దీర్ఘకాలికవ్యాధుల నుండి వీరికి ఉపశమనం లభిస్తుంది. శనిదేవుడు నాల్గవ మరియు ఐదవ ఇళ్లకు అధిపతిగా ఉండటం ఆరవఇంట్లో సంచరించడం వల్ల తులారాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీపరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి.
మకర రాశి
2026 సంవత్సరంలో శనిదేవుడు మకరరాశి వారిని కటాక్షిస్తాడు. మకర రాశిలో మూడవ ఇంట్లో శని సంచారం జరగడం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఆర్థిక లాభం మెరుగుపడుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ లు పెరుగుతాయి. ప్రయాణాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పొరుగువారు మరియు స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications