ఇది నిజం.. తిరోగమనంలో వీరికి సిరిసంపదల వర్షం కురిపిస్తానన్న శనిదేవుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో దేనికవే ప్రత్యేకమైనవి. ఇక నవగ్రహాలలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శనిదేవుడిని క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. న్యాయ దేవుడు అయిన శని మన కర్మ ఫలాలను అందిస్తాడు. అటువంటి శని దేవుడు జులై నెలలో తిరోగమనం చెందుతాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని దేవుడు మీనరాశిలో తిరోగమనం చెంది కూడా మనకు ప్రయోజనాలను చేకూరుస్తాడు.

శని తిరోగమన సంచారం
మీన రాశిలో శని తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీనరాశిలో శని తిరోగమన సంచారం నవంబర్ 15 వరకు కొనసాగుతుంది. అప్పటివరకు తిరోగమనం కారణంగా అదృష్టం పొందే మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

saturn has been giving wealth for these zodiac signs from July with retrograde transit

కన్యారాశి
మీన రాశిలో శని గ్రహ తిరోగమన సంచారం కన్యా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది.శని తిరోగమనం వీరికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి.కన్యా రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇది ఆర్ధిక పురోగతి కలిగించే సమయం.

మకర రాశి
మకర రాశి జాతకులకు శని తిరోగమన సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది . మకర రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా శుభాలే జరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది..వర్తక, వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగులకు ఈ సమయంలో కలిసి వస్తుంది.

మీనరాశి
మీన రాశి జాతకులకు శని తిరోగమన సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది . ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీన రాశి వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. విజయాలు సాధించే అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+