రాసిపెట్టుకోండి... తిరోగమనంలోనూ వీరిని కుబేరులను చేస్తానన్న శనిదేవుడు!

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని దేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతారు. శని క్రమశిక్షణకు మారుపేరు. సహనాన్ని ఇచ్చే దేవుడిగా శనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి శని మార్చి 29వ తేదీన కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారాన్ని మొదలుపెట్టాడు. ప్రస్తుతం మీనరాశిలో శని సంచారం కొనసాగుతుంది.30 సంవత్సరాల తర్వాత శని మీనరాశిలో సంచరిస్తున్న వేళ శని అనేక రాశులవారికి ప్రయోజనాలను చేకూరుస్తున్నాడు.

మీనరాశిలో శని తిరోగమనం
ముఖ్యంగా జూలై 13వ తేదీ ఉదయం 9:30 నిమిషాలకు శని మీన రాశిలో తిరోగమన సంచారాన్ని మొదలుపెడతాడు. మీన రాశిలోకి తిరోగమన సంచారాన్ని ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత శని మళ్లీ ప్రత్యక్షంగా మారతాడు. శని తిరోగమన సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Saturn is going retrograde and will turn these zodiac signs into Kuberas

కన్యారాశి
శని తిరోగమన సంచారం కన్యారాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు లాభాలు పొందుతారు. కన్యారాశిలో ఏడవ ఇంట్లో శని తిరోగమనం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉద్యోగం లేని వారు ఉద్యోగాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉంటాయి. శ్రమకి తగిన ఫలితం ఉంటుంది. ఇప్పటివరకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగఅవకాశాలు వస్తాయి. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది . ప్రేమ జీవితం బాగుంటుంది.

మకర రాశి
శని తిరోగమన సంచారం మకర రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. మకర రాశిలో శని మూడవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. దీనితో మకర రాశి వారికి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తోబుట్టువులు స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ఈ సమయంలో మకర రాశి వారికి కమ్యూనికేషన్ పెరుగుతుంది .

మీనరాశి
శని తిరోగమన సంచారం కారణంగా మీన రాశి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో మీన రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసే వారికి వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో ఓర్పుతో, నేర్పుతో పనులు చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+