వీరింటికి కుబేరుడిని పంపి కరుణిస్తున్న శని.. మీరున్నారా?

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి విశేష స్థానం ఉంది. శని దేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరైన శని దేవుడు శుభ స్థానంలో ఉంటే అంతా మంచే జరుగుతుంది. కానీ నీచ స్థానంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవని చెప్పి తీరాల్సిందే. శని సాధారణంగా ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరించి, ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు.

శని సంచారంతో లాభపడే రాశులు
అయితే ప్రస్తుతం శనిగ్రహం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మీన రాశిలో శని సంచారం ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మరియు ఇతర రంగాలలో కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని సంచారం కారణంగా అదృష్టాన్ని పొందే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Saturn is sending Kubera to bless these zodiac signs Are you in this

మిధున రాశి
మిధున రాశి వారికి శని సంచారం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకుల కష్టాలు తొలగిపోతాయి. వీరు ఏ పని చేసిన సానుకూల ఫలితాలను పొందుతారు. మిధున రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. సమస్యల నుండి విముక్తి పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం విజయాలను చేకూరుస్తుంది.

కుంభ రాశి
కుంభ రాశి వారికి శని సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థికంగా కుంభ రాశి వారు బలోపేతం అవుతారు. విద్యార్థులు చదువులో ఉన్నతిని సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి.

తులారాశి
తులా రాశి వారికి శని సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. వీరికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. తులా రాశి వారు ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇది తులా రాశి వారికి సానుకూల సమయం.

సింహరాశి
సింహ రాశి వారికి శని సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది. ప్రస్తుతం సింహ రాశి వారు అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నప్పటికీ శని వీరికి ఆర్థికంగా సానుకూల ప్రయోజనాలను కలిగిస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది .విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ప్రస్తుతం సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+