త్వరలో తిరోగమన శని వీరికి చూపిస్తుంది సంపదల గని.. మీరున్నారేమో చెక్ చేసుకోండి!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మ దేవుడు, క్రమశిక్షణకు అధిపతి అయిన శని దేవుడు 2026 సంవత్సరం జూలై మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మీనరాశిలో తిరోగమనంలో తిరుగుతాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని బృహస్పతి రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశించి జూన్ 2027 వరకు ఈ రాశి లోనే ఉంటాడు.
శని తిరోగమనం.. అదృష్ట రాశులు
ఈ సమయంలో శని ఏదో ఒక గ్రహంతో సంయోగం చెంది కొన్ని రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు . మొత్తం 138 రోజులపాటు శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తాడు. ఇక దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
శని గ్రహ తిరోగమన సంచారం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి సంచార జాతకంలో 12వ ఇంట్లో శని ఉండడం వల్ల తిరోగమనం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కెరీర్లో ఎంతో కాలంగా ఉన్న జాప్యం ఇప్పుడు ముగుస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. సీనియర్ అధికారుల నుంచి మన్నన లభిస్తుంది. పదోన్నతులు లభిస్తాయి .జీతం పెరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని గ్రహ తిరోగమన సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరిక ఉంటే తీరుతుంది. మీ పని ప్రోత్సాహాన్ని పొందుతుంది. వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది దీర్ఘకాల సవాళ్లు ముగుస్తాయి. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు.
మకర రాశి
శని తిరోగమన సంచారం మకర రాశి జాతకులకు అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది. మకర రాశిలో మూడవ ఇంట్లో శని తిరోగమనం జరుగుతుంది. దీనివల్ల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయాలను సాధిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబం నుండి శుభవార్తలు వింటారు.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications